E-Paper
Advertisement

హామీ ఇచ్చి నీళ్లు ఆపేశారా.. జూరాల ప్రాజెక్టుపై ఆశతో ఎదరుచూస్తున్న అన్నదాతలు!

హామీ ఇచ్చి నీళ్లు ఆపేశారా.. జూరాల ప్రాజెక్టుపై ఆశతో ఎదరుచూస్తున్న అన్నదాతలు!
Advertisement

Jurala Water; స్వేచ్చ బ్యూరో: కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు కృష్ణా జలాలు విడుదల చేయకపోవడంతో జూరాల ఆయకట్టుపై పెను ప్రభావం చూపనుంది. మరో రెండు నెలల పాటు నీటిని విడుదల చేస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల డ్యాం నుంచి కుడి, ఎడమ కాలువలకు వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు.

జూరాలకు మూడు టీఎంసీల నీరు వచ్చేనా

గత నెల క్రితం జూరాల డ్యాంలో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు నీటిని నిలిపివేయడంతో జూరాల డ్యామ్ పరిధిలోని కుడి, ఎడమ కాలువ పరిధిలోని రైతులు నీటి విడుదల చేయాలని జూరాల డాం ముట్టడితో పాటు ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో నీటి విడుదలపై చర్చించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను కలిసి ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి నీటి విడుదలపై విన్నవించారు.

జూరాలకు నీరు విడుదల..

Advertisement

జూరాల నీటి ఆధారంగా పండిస్తున్న ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ మూడు టీఎంసీల నీటిని విడతలవారీగా విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నేటికీ నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు విడుదల చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకతో చర్చించిన అనంతరం కురిసిన కొద్దిపాటి వర్షాలకు జూరాలకు వచ్చిన నీటి ప్రవాహంతో రైతులు ఆయకట్టు సాగుపై ఆశలు చిగురించాయి. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూరాలకు నీటిని విడుదల చేసినట్లయితే సాగునీటి కష్టాలు గట్టెక్కే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్టులకు నీటిని నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో వాటి ఆయకట్టు పరిధిలో చివరి వరకు నీటి ప్రవాహం కొనసాగే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

జూరాలలో నీటి నిల్వలు అంతంతే

Advertisement

కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూరాలకు విడుదల చేయాల్సిన మూడు టీఎంసీల నీటిని నేటికీ విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 8.454 మొత్తం నిల్వ ఉండగా కేవలం 4.747 టిఎంసిల లైవ్ స్టోరేజీ మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని మాత్రమే వారబంది పద్ధతిలో రైతుల పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు నీటితోపాటు రానున్న వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు మరో రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించిన దృష్ట్యా అక్కడి రైతు సంఘాలను ఒప్పించి విడుదల చేస్తే తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది.

నీటి విడుదలకు ప్రయత్నాలు

నారాయణపూర్ డ్యామ్ నుంచి అక్కడి ప్రభుత్వం అంగీకారం మేరకు జూరాలకు నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని డి నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో రబీ సాగులో రైతులు సమస్యను అర్థం చేసుకొని సాగునీటికి బదులు తాగునీటి ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. కేవలం బోర్లు, బావులు కలిగి నీటి వసతి ఉన్నవారు మాత్రమే ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలన్నారు.

Also read: అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

8. జెప్టో డెలివరీ కార్మికుడిపై దాడి.. చర్యలకు TGPWU డిమాండ్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్లగొండలో 80 శాతం పత్తిపంట నష్టం!

Big Stories

Advertisement
×