E-Paper
Advertisement

డిజిటల్ సిస్టమ్ చేతుల్లో మనుషుల బతుకు… యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన సై-ఫై కామెడీ థ్రిల్లర్

డిజిటల్ సిస్టమ్ చేతుల్లో మనుషుల బతుకు… యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన సై-ఫై కామెడీ థ్రిల్లర్
Advertisement

Sci Fi Comedy Series: సైన్స్ ఫిక్షన్ సినిమాలు సాధారణ మనుషుల ఊహకు కూడా అందనంత వింత స్టోరీలతో తెరపైకి వస్తూ ఉంటాయి. ఇలాంటి విజువల్ వండర్ కు కామెడీ తోడైతే… అలాంటి సినిమాలను అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటారు ఆడియన్స్. మీరు కూడా ఈ లిస్ట్ లో ఉంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ‘Upload’ అనే టైటిల్ తో రూపొందిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా సిరీస్ 2020లో తెరపైకి వచ్చింది. మరి ఈ సిరీస్ ను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇప్పటికే మనుషుల జీవితాల్లో ఏఐ క్రియేట్ చేస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఇక భవిష్యత్తులో సాంకేతికత పెరిగిపోతే మనుషుల జీవితాలు… ముఖ్యంగా చావు, మరణానంతర జీవితం ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక వినూత్నమైన కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే దీని మెయిన్ కాన్సెప్ట్ డిజిటల్ స్వర్గం అన్నమాట. ఇక కథలోకి వెళ్తే… 2033వ సంవత్సరంలో స్టోరీ షురూ అవుతుంది. ఆ కాలంలో మనుషులు చనిపోయే ముందు వారి మెదడులోని జ్ఞాపకాలను, స్పృహను కంప్యూటర్ సాయంతో ఒక వర్చువల్ రియాలిటీ (VR) ప్రపంచంలోకి ‘అప్‌లోడ్’ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

అంటే చనిపోయిన తర్వాత కూడా వారు డిజిటల్ రూపంలో స్వర్గం లాంటి ఒక రిసార్ట్‌ లో బతకొచ్చు అన్నమాట. ఇక ఇందులో ప్రధాన పాత్ర నాథన్ బ్రౌన్. అతనొక యంగ్ కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తాడు అటానమస్ అంబటే సొంతంగా నడిచే కారు ప్రమాదానికి గురవడంతో, అందులోనే ఉన్న హీరో చనిపోయే స్థితికి చేరుకుంటాడు. అతని ధనవంతురాలైన గర్ల్‌ఫ్రెండ్ ఇంగ్రిడ్ అతన్ని బలవంతంగా అత్యంత ఖరీదైన ‘లేక్‌వ్యూ’ అనే డిజిటల్ స్వర్గంలోకి అప్‌లోడ్ చేసేలా ప్లాన్ చేస్తుంది.

కథ ఇక్కడే టర్న్ తీసుకుంటుంది. డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లాక నాథన్‌ ను చూసుకోవడానికి ‘నోరా’ అనే ఒక బతికున్న అమ్మాయిని కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌ గా నియమిస్తారు. వాళ్ళ భాషలో ఆమెను ఏంజెల్ అంటారు. కంప్యూటర్ స్క్రీన్ ద్వారా నాథన్‌తో మాట్లాడుతుంది నోరా. ఈ క్రమంలో ఆమె నెమ్మదిగా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ నేపథ్యంలోనే నాథన్ కారు ప్రమాదం గురించి ఒక షాకింగ్ సీక్రెట్ బయట పడుతుంది. అది యాక్సిడెంట్ కాదు, అది ఒక ప్లాన్డ్ మర్డర్ అని నోరా తనకు దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తెలుసుకుంటుంది.

Advertisement

దానికి కారణం నాథన్ కనిపెట్టిన ఒక ఉచిత అప్‌లోడ్ యాప్. ఈ యాప్ వల్ల కార్పొరేట్ కంపెనీల బిజినెస్ దెబ్బతింటుందని అతనిని కావాలని చంపేశారని తెలుసుకుంటారు. మరి చనిపోయిన నాథన్ నిజం తెలుసుకుని ఏం చేశాడు ? బతికున్న నోరాతో కలిసి హంతకులను ఎలా కనిపెట్టారు ? డిజిటల్ ప్రపంచంలో ఒకటవ్వడానికి వీళ్ళు ఏం చేశారు ? అనేదే ఈ సిరీస్ కథ.

ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కేవలం ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తో మాత్రమే Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం లేదు. పాపులర్ సిట్కామ్ ‘ది ఆఫీస్’ (The Office) డైరెక్టర్ గ్రెగ్ డానియల్స్ సృష్టించిన ఈ సూపర్ హిట్ సిరీస్ మొత్తం 4 సీజన్లతో 30 ఎపిసోడ్‌లతో ఎండ్ అయ్యింది.

Read Also : తల్లీకూతుర్లకు నరకం చూపించే ఘోస్ట్‌ఫేస్ కిల్లర్… ఈ సైకోలు చేసిన పని చూస్తే బుర్రపాడు

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×