BigTV English
Advertisement

OTT Movie: ఫ్రెండ్ భార్యపైనే కన్ను… ఆపుకోలేక అడ్డమైన పనులు… పార్ట్స్ ప్యాక్ అయ్యే క్లైమాక్స్

OTT Movie: ఫ్రెండ్ భార్యపైనే కన్ను… ఆపుకోలేక అడ్డమైన పనులు… పార్ట్స్ ప్యాక్ అయ్యే క్లైమాక్స్

OTT Movie : బెంగాలీ సినిమా ఇష్టపడేవాళ్లకు ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా మనిషికి ఉన్న చెడ్డ గుణం వల్ల ఎదుటివాళ్ళ జీవితం ఎలా ఇబ్బందుల్లో పడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఒక చక్కని జంట ఆఖరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


Hoichoiలో స్ట్రీమింగ్

“Athhoi” 2024లో విడుదలైన ఒక బెంగాలీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఇది విలియం షేక్‌స్పియర్ క్లాసిక్ ట్రాజెడీ “Othello ” ఆధునిక అడాప్టేషన్. దీన్ని అర్నా ముఖోపాధ్యాయ్ డైరెక్ట్ చేశాడు. అతనే ఒక ప్రధాన పాత్రలో (అథోయ్‌గా) నటించాడు. అనిర్బన్ భట్టాచార్య (గోగోగా), సోహిని సర్కార్ (దియమోనాగా), దితిప్రియా రాయ్, అర్పన్ ఘోషాల్ కీలక పాత్రల్లో నటించారు. Jio Studios, SVF బ్యానర్‌లో జ్యోతి దేశ్‌పాండే, శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని దీనిని నిర్మించారు. ఈ మూవీ 2024 జూన్ 14న థియేటర్లలో విడుదలై, 2025 మే 30 నుంచి Hoichoiలో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.3/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

విన్సూరా అనే ఊరిలోడాక్టర్ అథోయ్ లోధా (అర్నా ముఖోపాధ్యాయ్) అనే దళిత వ్యక్తి తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అతను గోగో (అనిర్బన్ భట్టాచార్య) అనే చిన్ననాటి స్నేహితుడితో తన సంతోషాలను పంచుకుంటూ ఉంటాడు. గోగో తండ్రి స్పాన్సర్‌షిప్‌లోనే అథోయ్ డాక్టర్ అవుతాడు. చిన్నప్పుడు ఇద్దరూ తమ తల్లులను కోల్పోవడంతో, ఇది వాళ్ల మనస్తత్వంపై ప్రభావాలు చూపిస్తుంది. అథోయ్ తన ప్రొఫెసర్ కూతురు దియమోనా (సోహిని సర్కార్)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి కూడా చేసుకుంటాడు. దియమోనా ఊరిలో స్కూల్, హెల్త్ సెంటర్ నడుపుతూ సామాజిక సేవలు చేస్తుంది. ఆమె అందం ఊరిలోని చాలా మంది పురుషులను అట్రాక్ట్ చేస్తుంది. ఇది అథోయ్, గోగో ఇద్దరూ గమనిస్తారు.

ఇది ఇలా ఉంటే అథోయ్ విజయం పట్ల గోగో ఈర్ష్యతో రగిలిపోతాడు. అతని మనసులో దియమోనా నమ్మకద్రోహం చేస్తోందని అనుమానాలు గోగో రేకెత్తిస్తాడు. గోగో పాత్ర చాలా కన్నింగ్‌గా, మానిపులేటివ్‌గా ఉంటుంది. అతను అథోయ్‌ని మానసికంగా బలహీనపరుస్తూ, దియమోనాపై అనవసరమైన డౌట్స్ పెంచుతాడు. ఈ మానిపులేషన్ కారణంగా అథోయ్ జీవితం ట్రాజెడీ వైపు జారుతుంది. కథలో అథోయ్ దళిత బ్యాక్‌గ్రౌండ్, సమాజంలో అతని స్థానం, ప్రేమ, ఈర్ష్య వంటి ఎమోషన్స్ బలంగా చూపిస్తారు. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అథోయ్ తన భార్యతో కలసి ఉండగలడా ? గోగో వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : దెయ్యాల కొంపలో డేంజరస్ స్టంట్లు… క్షణానికో ట్విస్ట్… కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి

Related News

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : ఒకే రోజు ఓటీటీని షేక్ చేయబోతున్న రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ”లోకా చాప్టర్ 1: చంద్ర’… ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసా?

OTT Movie : భర్త ఫ్రెండ్ తోనే ఆ పాడు పని… మైండ్ బెండింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… డోంట్ మిస్

OTT Movie : భర్త లేని టైమ్ లో భార్య గదిలోకి… ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి కన్పిస్తే కథ కంచికే… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×