E-Paper
Advertisement

Upcoming Web Series 2026 : ‘మట్కా కింగ్’ నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4’ వరకు… 2026లో రానున్న మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు ఇవే

Upcoming Web Series 2026 : ‘మట్కా కింగ్’ నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4’ వరకు… 2026లో రానున్న మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు ఇవే
Advertisement

Upcoming Web Series 2026 : 2026లో ఎన్నో పాపులర్ వెబ్ సిరీస్‌ల కొత్త సీజన్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్నాయి. ఈ అప్ కమింగ్ వెబ్ సిరీస్‌ల గురించి ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త సీజన్‌ లు ఉత్తేజకరమైన కథాంశాలతో, ఊహించని మలుపులతో అదరగొట్టబోతున్నాయి. ఈ మెగా బడ్జెట్ వెబ్ సిరీస్‌లలో కొన్ని మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దాం పదండి.

Matka King

జూదంలో ఉన్న ప్రమాదాలు, నష్టాలను కళ్ళకు కట్టే సిరీస్ “మట్కా కింగ్” ఈ సంవత్సరం విడుదల కానుంది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మ, కృతికా కమ్రా, సాయి తమహంకర్ నటించారు. మార్చికి ముందు ఈ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.

Heeramandi 2

Advertisement

సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సిరీస్ “హీరామండి” ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. వివాదాస్పదం అయినప్పటికీ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండవ భాగం “హీరామండి 2” 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Gullak 5

2009లో SonyLIVలో ప్రీమియర్ అయిన “గుల్లక్” సిరీస్ ఐదవ సీజన్ ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.

The Family Man Season 4

Advertisement

‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ ఇటీవలే ప్రీమియర్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం సీజన్ 4 ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించారు.

Farzi 2

రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన “ఫర్జి” విజయం తర్వాత, షాహిద్ కపూర్ తో “ఫర్జి 2” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జూన్ – జూలై మధ్య సెకండ్ పార్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి కూడా ఈ సిరీస్‌లో నటించారు.

కోటా ఫ్యాక్టరీ 4

‘కోటా ఫ్యాక్టరీ’ కొత్త సీజన్ కూడా ఇదే ఏడాది రాబోతోంది. ఇందులో జీతు భయ్యా తన పాత్రలో కనిపిస్తాడు. సీజన్ 4 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ గురించి ఫ్యాన్స్ వెయిటింగ్.

Kohrra 2

బరున్ సోబ్తి వెబ్ సిరీస్ “కోహ్రా” అంతర్జాతీయంగా హిట్ అయింది. ఇప్పుడు “కోహ్రా 2” రాబోతోంది. ఈసారి మోనా సింగ్ కూడా తారాగణంతో చేరింది. ఇప్పటికే సిరీస్ షూటింగ్ ముగిసింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

పంచాయత్ 5 (Panchayat 5)

“పంచాయత్” అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2020 లో విడుదలైంది. మొదటి సీజన్ నుంచి గత 4 సీజన్లను ఆడియన్స్ ను అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఐదవ సీజన్ ఈ సంవత్సరం విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మరోసారి జితేంద్ర కుమార్, నీనా గుప్తా మరియు రఘుబీర్ యాదవ్ నటించనున్నారు. రిలీజ్ డేట్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

వీటితో పాటు ఇమ్రాన్ హష్మీ సిరీస్ “తస్కారి: ది స్మగ్లర్స్ వెబ్” జనవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. అదితి రావు హైదరి వెబ్ సిరీస్ “ఓ సాథీ రే”, “ఆపరేషన్ సఫేద్ సాగర్” నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నాయి. ఇంకా భూమి పెడ్నేకర్ నటించిన “దల్దల్” సిరీస్ కూడా రిలీజ్ కానుంది.

Read Also :  న్యూయర్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు.. మస్ట్ వాచ్..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×