OTT Movie : ఊరి పొలిమేరలో ఉండే స్మశానం పూడ్చి పెట్టిన శవాలతో నిండిపోతే… సాధారణంగా మరో ప్లేస్ ను వెతుక్కుంటారు. కానీ ఆ కొత్త ప్లేస్ దొరక్కపోతే ఎలా ఉంటుందో ఫన్నీగా కీర్తి సురేష్ నటించిన ఓ కొత్త సినిమాలో అద్భుతంగా చూపించారు. ఆ సినిమా పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). అని ఐ.వి. శశి దర్శకత్వంలో తీసిన తెలుగు సెటైరికల్ కామెడీ-డ్రామాలో కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, సుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 135 నిమిషాల రన్‌టైమ్‌తో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ విడుదలైంది. రాధిక లావు నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
కథ 1990ల నాటి కల్పిత గ్రామం చిట్టి జయపురంలో జరుగుతుంది. ఈ గ్రామంలో మరణించిన వారిని దహనం చేయకుండా, శ్మశానంలో ఖననం చేసి, సమాధిపై మరణానికి కారణం రాసిన నోట్ ఉంచే వింత సంప్రదాయం ఉంటుంది ఈ ఊర్లో. చిన్నా (సుహాస్) శ్మశాన వ్యవహారాలు చూసే యువకుడు. మరోవైపు గ్రామ పెద్ద సుబ్బరాజు (సుభలేఖ సుధాకర్) మరణంతో, అతని కూతురు అపూర్వ (కీర్తి సురేశ్) ఊరి పెద్ద బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె అమాయకత్వం కారణంగా, భీమయ్య (బాబు మోహన్), మధుబాబు (శత్రు) వంటి గ్రామస్తులు ఆమె నాయకత్వాన్ని తక్కువ చేసి, అధికారం కోసం కుట్రలు పన్నుతారు.
ఇక శ్మశానంలో నాలుగు స్థలాలు మాత్రమే మిగిలి ఉండటంతో సమస్య మొదలవుతుంది. చిన్నా క్యాన్సర్‌తో బాధపడే తన తల్లి కొండమ్మ (తాళ్లూరి రామేశ్వరి) కోసం ఒక స్థలాన్ని కాపాడాలనుకుంటాడు. గ్రామస్తులు వివిధ కులాలు, ఆర్థిక స్థాయిల వారు… ఈ స్థలాల కోసం పోటీ పడతారు, కుల వివక్ష, అధికార దాహం బయట పడతాయి. అపూర్వ, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయిస్తుంది. ఇది కామెడీ, అలాగే తీవ్రమైన వాదనలకు దారితీస్తుంది. చిన్నా, అపూర్వ కలిసి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి అనుకుంటారు. మరి వీళ్ళిద్దరూ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని వెతికారు? ఈ క్రమంలో ఎదురైన సమస్యలు ఏంటి? చిన్నా తల్లికి స్మశానంలో చోటు దొరికిందా ? అన్న అంశాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఆడ వేషాలు వేస్తూ నిజంగానే అమ్మాయిలా… మరి లవర్ పరిస్థితి ఏంటి?