BigTV English

KCR: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. ఇది ఆయన ప్రస్తుత పరిస్థితి

KCR: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. ఇది ఆయన ప్రస్తుత పరిస్థితి

KCR NEWS: ఈ రోజు ఉదయం అస్వస్థతతో మాజీ సీఎం యశోదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల చేసిన తర్వాత ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. రెండు టెస్టులు చేసిన తర్వాత ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కాసేపటి తర్వాత మూడు టెస్ట్ చేయించుకున్నారు. కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యి నందినగర్ లోని నివాసానికి చేరుకున్నారు.


వారం కిందట అంటే సీజనల్ ఫీవర్‌తో కేసీఆర్ బాధపడ్డారు. జులై 3న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ లో నందినగర్ లోని నివాసానాకి చేరుకున్నారు. అనంతరం యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి పరీక్షలు తర్వాత ఇంటికి చేరుకున్నారు. వారంలో రోజుల వ్యవధిలో ఆయన రెండోసారి ఆసుపత్రికి వెళ్లారు.

అయితే గడిచిన నాలుగు రోజులు కేసీఆర్.. ఆ పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణకు ఎదురయ్యే ముప్పుపై చర్చించారట. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.


పార్టీ వర్గాలు మరోలా చెబుతున్నారు. కొద్దిరోజుల్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అంటున్నాయి. ఇందులోభాగంగా హెల్త్ చెకప్ చేయించు కుంటున్నారని చెబుతున్నాయి. బీఆర్ఎస్ హయంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబడుతోంది.

తాను తప్పు చేశామనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇలాంటి అపోహాలను తలొగించాలంటే ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని పెద్దాయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ లేవనెత్తిన ప్రతీ అంశానికి కేసీఆర్ బదులు ఇస్తారని అంటున్నాయి.

ALSO READ: Rain News: ఈ ప్రాంతానికి రేపు భారీ వర్షం.. ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన

ఎన్నికల తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్‌గా లేరు. కేవలం ఫామ్‌హౌస్‌‌కి పరిమితమయ్యారు. చీటికి మాటికీ అధినేత అనారోగ్యానికి గురికావడంతో కొందరు నేతలతోపాటు కేడర్‌లో తెలియని అయోమయం నెలకొంది. వివిధ అంశాలపై అధికార పార్టీ సవాళ్లు విసిరినా అధినేత సైలెంట్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి కేసీఆర్ ఆరోగ్యం ఫోకస్ పెట్టారు.

ALSO READ: Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇలా చేస్తుంది ఏంటి.. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందా !

ఈ రోజు యశోదా ఆస్పత్రిలో రెండు టెస్టుల చేసిన తర్వాత ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. రెండు టెస్టులు చేసిన తర్వాత ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కాసేపటి తర్వాత మూడు టెస్ట్ చేయించుకున్నారు. కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యి నందినగర్ లోని నివాసానికి చేరుకున్నారు.

Related News

ORR Closed: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ORR సర్వీసులు బంద్

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Big Stories

×