BigTV English

Anil Ravipudi:  నేనూ రామాయణం తీస్తానంటున్న అనిల్ రావిపూడి.. ఇంకెంత మంది తీస్తారయ్యా?

Anil Ravipudi:  నేనూ రామాయణం తీస్తానంటున్న అనిల్ రావిపూడి.. ఇంకెంత మంది తీస్తారయ్యా?

Mahabaratam: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మైథాలజికల్ సినిమాలు చేసే వారి సంఖ్య అధికమైంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని ఎంతో ఇష్టపడుతున్న నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రామాయణం (Ramayanam)ఆధారంగా చాలా సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి. అలాగే మహాభారతం (Mahabaratam)ఆధారంగా సినిమాలు చేయాలని ఎంతో మంది దర్శకులు ఇటీవల వారి కోరికను బయటపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మహాభారతంపై ఫోకస్ చేశారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)డ్రీమ్ కూడా మహాభారతం సినిమా చేయటమేనని ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. ఇటీవల యంగ్ హీరో అడివి శేష్ కూడా మహాభారతం చేయటం నా డ్రీమ్ అని వెల్లడించారు.


మైథాలజీ సినిమా చేయటమే డ్రీమ్..

ఇకపోతే రామాయణం మహాభారతంలో ఎన్నో భాగాలు ఉన్నాయి .ఇలా ఒక్కో భాగం గురించి ఒక్కో సినిమా చేయవచ్చు. అయితే తాజాగా మరొక డైరెక్టర్ కూడా నాకు మహాభారతం లేదా రామాయణం లాంటి మైథాలజీ సినిమా చేయాలని కోరిక ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. మరి ఈ తరహా సినిమా చేయాలని చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి సినిమాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమని చెబుతారు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ.. ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.


అనిల్ రావిపూడి కేరాఫ్ పటాస్

ఇకపోతే రామాయణం లేదా మహాభారతం వంటి మైథాలజీ సినిమాలు కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నానని అయితే ఆ సినిమాలు ఇప్పుడు చేయనని, ఆ సినిమాలు చేసే స్థాయికి నేను ఎదిగితే తప్పకుండా ఆ సినిమాలు చేస్తాను అంటూ ఈ సందర్భంగా మరోసారి అనిల్ రావిపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశారు. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. తన డైరెక్షన్లో ఇన్ని హిట్ సినిమాలు అందుకున్న అనిల్ రావిపూడి  కేరాఫ్ అంటే పటాస్(Pataas) సినిమా అని చెబుతానంటూ తెలిపారు.

ఆ విషయంలో స్వార్థపరుడిని…

పటాస్ సినిమా నా కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని తెలిపారు. ఇక ఇప్పటికే ఈయన పలువురు హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ తో ఎందుకు అని సినిమా చేయలేదు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ జై లవకుశ సమయంలో తారక్ గారిని కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాను.  ఆ స్టోరీ లైఫ్ తారక్ కు చాలా బాగా నచ్చింది కానీ కొన్ని కారణాలవల్ల ఆయనతో చేయలేకపోయానని అందుకు కారణం తారక్ బిజీ షెడ్యూల్ అని తెలిపారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ గారితో తప్పకుండా సినిమా చేస్తానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక మీ డ్రీమ్ హీరో ఎవరు అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఈ విషయంలో నేను చాలా స్వార్థపరుడిని, ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటాను అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Udayabhanu: ఉదయభానును ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారా… యాంకరింగ్ సిండికేట్ అయ్యిందా?

Related News

Sp Charan : ఇంటి అద్దె చెల్లించకుండా బెదిరింపులు.. డైరెక్టర్ పై చరణ్‌ ఫిర్యాదు..

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Big Stories

×