BigTV English

Telangana: హైదరాబాద్ యువతకు గుడ్ న్యూస్.. యూకేలో చదవాలనుకునే వారికి కొత్త అవకాశాలు

Telangana: హైదరాబాద్ యువతకు గుడ్ న్యూస్.. యూకేలో చదవాలనుకునే వారికి కొత్త అవకాశాలు

Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలావరకు యువత ఫారిన్ దేశాల్లో చదువుకోవాలని కలలు కంటుంటారు. ముఖ్యంగా అమెరికా, యూకే వెళ్లాలని ఆశపడుతుంటారు. అలాంటి వారి కలలు నిజం చేయడానికి ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా ఎన్ఐఎస్ఏయు సహకారంతో హైదరాబాద్‌కు యూకే అవకాశాలు తీసుకురావాలని సిద్ధమయ్యింది గ్లోబల్ ట్రీ. బంజారా హిల్స్‌లోని ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్‌లో గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గ్లోబల్ ట్రీ సిద్ధమయ్యింది. ఏప్రిల్ 12న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తోంది.


గ్లోబల్ కనెక్ట్

విదేశీ విద్యా రంగంలో గ్లోబల్ ట్రీ పెద్ద సంస్థగా నిలిచింది. దీంతో పాటు నెట్‌వర్క్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్నీ యూకే (ఎన్ఐఎస్ఏయు) భాగస్వామ్యంతో గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కనెక్ట్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ఎన్నో సర్వీసులు అందిస్తోంది. యూకేలోనే నెంబర్ 2 కాలేజ్‌గా ప్రఖ్యాతిగాంచిన ఇంపీరియల్ కాలేజ్‌తో సహా మరెన్నో ఫేమస్ కాలేజ్‌కు సంబంధించిన వారితో స్టూడెంట్స్ స్వయంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోవడం కోసం పంజాగుట్టలోని గ్లోబల్ ట్రీ కార్య్రాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.


మంచి అవకాశం

గ్లోబల్ ట్రీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ అలపాటి, గ్లోబల్ ట్రీ కంట్రీ హెడ్ నమ్రతా గోటి పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను లాంచ్ చేశారు. పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు. ‘‘ఈ కార్యక్రమం విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఆఫర్లు గురించి తెలుసుకోవడంతో పాటుగా టాప్ యూనివర్సిటీలతో నేరుగా కనెక్ట్ కావడానికి ఒక మంచి అవకాశం’’ అని శ్రీకర్ అలపాటి చెప్పారు. విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తు గురించి తగిన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయ పడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు అండ్ వాణిజ్య విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఇందులో పాల్గోనున్నారు.

Also Read: హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

టికెట్స్ ఫ్రీ

గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కనెక్ట్‌కు ప్రవేశం ఉచితమని ప్రకటించారు. విద్యార్థులు అధికారిక ఈవెంట్ పోస్టర్‌లోని QR కోడ్‌ను ఉపయోగించి ముందుగానే నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్ మాజీ సభ్యుడు వీరేంద్ర శర్మ పాల్గొనడంతో పాటుగా విద్య, ప్రజా సేవపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. అంతే కాకుండా ఇందులో పాల్గొనే విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా టాబ్స్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు దీనికి హాజరయిన వారందరూ మే 31న హైదరాబాద్‌లో జరిగే బాద్దా లైవ్ కాన్సర్ట్‌కు పాస్లను కూడా అందుకుంటారు. మరిన్ని వివరాల కోసం +91 88866 73703ని విద్యార్థులు సంప్రదించవచ్చు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×