OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి ఈ ఏడాది జనవరి నెలలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి. నేషనల్ అవార్డు విన్నర్ బాల దర్శకత్వం వహించిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటిటి లో అదరగొడుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వనంగాన్‘ (Vanangaan). 2025 లో విడుదలైన ఈ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బాలా దర్శకత్వం వహించాడు. వి హౌస్ ప్రొడక్షన్స్, సురేష్ కామచ్చితో పాటు బి స్టూడియోస్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో అరుణ్ విజయ్, రిధా, రోష్ని ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సునామీలో శివ తన తల్లిదండ్రులను కోల్పోయి ఉంటాడు. తనకి చెల్లెలు లక్ష్మీ మాత్రమే ఉంటుంది. ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న హిజ్రాలని కొంతమంది ఆకతాయిలు కొడుతూ ఉంటారు. అది చూసిన శివ వాళ్ళని, కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. పోలీస్ స్టేషన్లో కూడా ఆపకుండా కొడుతూనే ఉంటాడు. అతనిని అక్కడున్న పోలీసులు కంట్రోల్ చేసి సెల్లో వేస్తారు. ఎస్సై అతనిపై కేసు నమోదు చేసి, అతడే నేరం చేశానని ఒప్పుకున్నట్టు చెప్పాడని జడ్జికి వివరిస్తాడు. ఇంతలో శివ కోసం వచ్చిన చర్చ్ ఫాదర్, జడ్జికి ఒక రిపోర్ట్ ఇస్తాడు. అందులో శివ మూగవాడని ఉంటుంది. ఇది చూసి జడ్జి పోలీసులను మందలిస్తాడు. మూగవాడు తానే నేరం చేశానని ఎలా చెప్పాడని, అమాయకులను ఇటువంటి కేసులో ఇరికించవద్దని జడ్జి చెప్తాడు. ఈ కేసును కొట్టివేస్తూ శివని ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత శివని కంట్రోల్ చేయడానికి ఒక అనాధ శరణాలయానికి పంపిస్తారు. అక్కడ చాలామంది అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు. కళ్ళు కనిపించకుండా మాటలు మాట్లాడలేని, వీళ్లను శివ బాగా చూసుకుంటూ ఉంటాడు.
అయితే ఒకరోజు కొంతమంది వ్యక్తులు, ఇక్కడున్న అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటే వీడియో తీసి చూస్తూ ఉంటారు. ఇది గమనించిన శివ వాళ్లను కొట్టుకుంటూ తీసుకువెళ్తాడు. అందులో ఒకడు పారిపోగా, ఇద్దరిని శివ చంపేస్తాడు. శివ మీద అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. అక్కడికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శివ చేత నిజం చెప్పించాలనుకుంటాడు. ఎంతమంది అడిగినా వాళ్ళను ఎందుకు చంపాడనే విషయం చెప్పకుండానే ఉంటాడు. చివరికి చెల్లెలు అడిగినా కూడా చెప్పకపోవడంతో, చెల్లెలు చాలా బాధపడుతుంది. శివ వీటికి సమాధానం చెప్పకపోగా, పారిపోయిన మూడో వ్యక్తిని కూడా చంపేస్తానని అంటాడు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. చివరికి ఈ కేసులో శివకి శిక్ష పడుతుందా? మూడో వ్యక్తిని కూడా శివ చంపుతాడు? పోలీస్ ఆఫీసర్ శివనుంచి నిజాలు రాబట్టడానికి ఏం చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.