OTT Movie : వెంకటేష్ వీ.పీ. (Venkitesh V.P.) మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఒక నవతరం నటుడు. టీవీ షోలు, సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో గుర్తింపు పొందాడు. 2018లో ‘నాయికా నాయకన్’ అనే టాలెంట్ హంట్ రియాలిటీ షోలో పాల్గొని, తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించి, ‘బెస్ట్ కమెడియన్’ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను మలయాళ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. స్టాండ్ అప్ (2019), ఖో-ఖో (2021), ఒడియన్ (2018), తట్టుంపురత్ అచ్యుతన్ (2018), ది ప్రీస్ట్ (2021) సినిమాలు అతని కెరీర్‌లో గుర్తించదగినవి.
వెంకటేష్ వీ.పీ. 1993 ఆగస్టు 9న కేరళలోని తిరువనంతపురంలో జన్మించాడు. ‘నాయికా నాయకన్’ షోలో కామెడీ పాత్రలు పోషించాడు. ముఖ్యంగా “నాన్ షణ్ముఘి” రౌండ్‌లో డ్రాగ్ పెర్ఫార్మెన్స్, “ప్రేమం” రౌండ్‌లో నవవధువు పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని మొదటి సినిమా వెలిపాడింటే పుస్తకం (2017)లో ఒక చిన్న పాత్రతో మొదలైంది. ఇందులో అతను “ఎంటమ్మెడే జిమిక్కి కమ్మల్” పాటలో కనిపించాడు. ఆ తర్వాత అతను స్టాండ్ అప్, ఖో-ఖోలో ప్రధాన పాత్రలు, ఒడియన్, తట్టుంపురత్ అచ్యుతన్లో సహాయక పాత్రలను పోషించాడు. ఇటీవల అతను విజయ్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా కింగ్డమ్ (2025)లో నటించి, తెలుగు ప్రేక్షకుల దృష్టిని తన వైపు కూడా తిప్పుకున్నాడు.
వెంకటేష్ వీ.పీ. నటించిన టాప్ 5 మలయాళ సినిమాలు
1. ‘స్టాండ్ అప్’ (Stand Up)
2019 లో వచ్చిన ఈ సినిమాకి విధు విన్సెంట్ దర్శకత్వం వహించారు. ఇందులో రజిషా విజయన్, నిమిషా సజయన్, వెంకటేష్ వీ.పీ.
ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ దియా (రజిషా విజయన్) తన బాయ్‌ఫ్రెండ్ అమల్ (వెంకటేష్ వీ.పీ.) నుంచి గృహ హింసను ఎదుర్కొంటుంది. ఆమె స్నేహితురాలు కీర్తి (నిమిషా సజయన్) దియాకు మద్దతుగా నిలుస్తుంది. వెంకటేష్ వీ.పీ. ఇందులో ఒక వైవిధ్యమైన అమల్ పాత్రను పోషించాడు. ఇందులో వెంకటేష్ వీ.పీ. తన కామెడీ నటనకు భిన్నంగా, అతని డ్రామాటిక్ రేంజ్‌ను చూపిస్తుంది. IMDbలో ఈ సినిమా 6.8/10 రేటింగ్ ను పొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
2. ‘ఖో-ఖో’ (Kho Kho)
2021 లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో రజిషా విజయన్, మమిత బైజు, వెంకటేష్ వీ.పీ. ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఖో-ఖో చుట్టూ తిరుగుతుంది. మరియా (రజిషా విజయన్) అనే ఒక మాజీ అథ్లెట్, ఒక పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరి, బాలికల ఖో-ఖో జట్టుకు శిక్షణ ఇస్తుంది. వెంకటేష్ వీ.పీ. మరియా భర్తగా, ఒక మాజీ అథ్లెట్‌గా నటిస్తాడు. ఆమె ప్రయాణంలో మద్దతుగా నిలుస్తాడు. ఈ సినిమాలో అతని పాత్రకు ప్రశంసలు కూడా వచ్చాయి. IMDb లో ఏ సినిమాకి 6.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
3. ‘ఒడియన్’ (Odiyan)
2018లో వచ్చిన ఈ యాక్షన్ సినిమాకి వి.ఎ. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాష్ రాజ్, వెంకటేష్ వీ.పీ. ప్రధానపాత్రల్లో నటించారు. ఈ స్టోరీ కేరళలోని ఒడియన్ కులం చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఆకారం మార్చగల బ్లాక్ మాజిక్ ప్రాక్టీషనర్లుగా పిలువబడతారు. మానిక్యన్ (మోహన్‌లాల్) ఒక ఒడియన్, తన గతాన్ని దాచిపెట్టి జీవించాలనుకుంటాడు. కానీ అతను గ్రామానికి తిరిగి రావడం అనేక మలుపులకు దారితీస్తుంది. వెంకటేష్ వీ.పీ. ఒక గ్రామస్థుడిగా ఇందులో ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు. కథలో భాగమై, సినిమా గ్రామీణ వాతావరణాన్ని పెంచుతాడు. ఈ సినిమాకి IMDbలో 5.3/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
4. ‘తట్టుంపురత్ అచ్యుతన్’ (Thattumpurath Achuthan)
2018లో వచ్చిన ఈ రొమాంటిక్ సినిమాకి లాల్ జోస్ దర్శకత్వం వహించారు. ఇందులో కుంచాకో బోబన్, శ్రావణ, వెంకటేష్ వీ.పీ.
ప్రధానపాత్రల్లో నటించారు. చెలప్రం అనే గ్రామంలో నివసించే అచ్యుతన్ (కుంచాకో బోబన్) ఒక శ్రీకృష్ణ భక్తుడు. తన మంచితనంతో గ్రామస్తుల హృదయాలను గెలుచుకుంటాడు. ఒక రోజు ఆలయంలోని హుండీలో ఒక లేఖ అతనికి దొరుకుతుంది. ఇది జయలక్ష్మి (శ్రావణ) జీవితంలోకి అతన్ని తీసుకెళ్తుంది. వెంకటేష్ వీ.పీ. “ముత్తుమణి రాధే” పాటలో ఒక కామియో పాత్రలో కనిపిస్తాడు. ఇది సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తుంది. ఈ కథాంశం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. IMDbలో దీనికి 4.8/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
5. ‘ది ప్రీస్ట్’ (The Priest)
2021లో రిలీజ్ ఐన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించారు. ఇందులో మమ్ముట్టి, మంజు వారియర్, నిఖిల విమల్, వెంకటేష్ వీ.పీ. నటించారు. ఇందులో ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ (మమ్ముట్టి) ఒక డిటెక్టివ్ పాత్రలో ఉన్న ప్రీస్ట్. ఒక ఆత్మహత్యల మిస్టరీని పరిశోధిస్తాడు. వెంకటేష్ వీ.పీ. సిద్ధార్థ్‌గా, జెస్సీ (నిఖిల విమల్)కి బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తాడు. ఇది కథలో కీలకమైన సహాయక పాత్రగా ఉంటుంది. అతని నటన, మమ్ముట్టితో ఉన్న సన్నివేశాలు, సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. IMDbలో ఈ సినిమాకి 6.5/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.