OTT Movie : రిలేషన్స్, ఎమోషన్స్ ఈ రెండింటికి జీవితంలో చాలా విలువ ఉంటుంది. మనిషి జీవితాన్ని కూడా ఈ రెండు చాలా వరకు నడిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ప్రేమ అనే ఒక ఎమోషన్ చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ సరదాగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’ (Vicky Cristina Barcelona).ఈ మూవీకి వుడీ అలెన్ దర్శకత్వం వహించారు. ఇందులో జేవియర్ బార్డెమ్, పెనెలోప్ క్రజ్, రెబెకా హాల్, స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు అమెరికన్ మహిళలు విక్కీ, క్రిస్టినా బార్సిలోనాలో వేసవి కాలం గడపడానికి వెళతారు. జువాన్ ఆంటోనియో అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ తరువాత జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీని బార్సిలోనా, అవిలేస్, ఒవిడోలలో చిత్రీకరించారు. ‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయం సాధించి, అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
విక్కీ, క్రిస్టినా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. విక్కీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే అతనితో రిలేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. క్రిస్టినా కి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ రిలేషన్ ని లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత విక్కీ, క్రిస్టినా వెకేషన్ కి బార్సిలోనాకి వెళ్తారు. అక్కడ ఒక పార్టీలో హీరో వీళ్ళిద్దరికీ పరిచయమవుతాడు. అయితే మొదట అతని గురించి కొంతమంది తప్పుగా చెప్తారు. ఆతరువాత విక్కీ అతనికి కాస్త దూరంగానే ఉంటుంది. క్రిస్టినా అతనితో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతుంది. హీరోకి ఇదివరకే పెళ్లి కూడా జరిగి ఉంటుంది. అయితే ఆమెతో అతనికి ఎక్కువగా విభేదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టినా తనతో క్లోజ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో రిలేషన్ స్టార్ట్ చేస్తారు. విక్కీ కూడా అతడు పరిచయం అయ్యాక, అతనికి పడిపోతుంది.
అయితే క్రిస్టినా అతనితో క్లోజ్ గా ఉండటంతో సైలెంట్ గా ఉంటుంది. అలా క్రిస్టినా, హీరో రిలేషన్ లో ఉన్నప్పుడు హీరో భార్య మళ్ళీ వస్తుంది. నేను లేనప్పుడు ఎవరితో ఉన్నావ్ అంటూ లోపలికి వస్తుంది. అలా వీళ్లు ముగ్గురు కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. భార్య, ప్రియురాలుతో హీరో సరదాగా గడిపేస్తుంటాడు. మరోవైపు విక్కీ కూడా హీరోని తలుచుకుంటూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ను కూడా పక్కన పెట్టేస్తుంది. చివరికి వీళ్ళు ఎవరిని, ఎవరు లవ్ చేస్తారు. ఎవరు ప్లే బాయ్ లా ఉంటారు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.