BigTV English

Fridge: పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టొద్దు తెలుసా ?

Fridge: పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టొద్దు తెలుసా ?

Fridge: మనం కూరగాయలు, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువగా ఫ్రిజ్ వాడుతుంటాం. బయటతో పోలిస్తే.. కొన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ కొన్ని సాధారణ ఆహారాలు ఫ్రిజ్‌లో ఉంచితే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. మరి పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలతో సహా ఫ్రిజ్‌లో పెట్టకూడనివి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


అరటి పండ్లు:
అరటి పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే అవి బయటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అరటిపండ్లు పచ్చిగా ఉంటే, వాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన తర్వాత అవి పక్వానికి రావడం కష్టం ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలో తొందరగా పండవు. అంతే కాకుండా ఫ్రీజర్‌లో ఉంచితే అవి చాలా త్వరగా నల్లగా మారతాయి. అరటి కొమ్మ నుండి ఇథిలిన్ వాయువు కూడా విడుదలవుతుంది. ఇది చుట్టుపక్కల పండ్లను చాలా త్వరగా పండేలా చేస్తుంది.

టమాటో:
టమాటోలు ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడైపోతాయి. టమాటోలను బహిరంగ ప్రదేశంలోనే ఉంచాలి. టమాటో ఎండలో పెరిగే పండు, ఇది తీవ్రమైన చలిలో చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.


ఆపిల్ :
ఆపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. తక్కువ ఉష్ణోగ్రతలలో, ఆపిల్‌లో ఉండే ఎంజైమ్‌లు చురుకుగా మారి ఆపిల్ త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తాయి. విత్తనాలు కలిగిన ఏ పండ్లను ఫ్రీజర్‌లో ఉంచకూడదు.

నారింజ:
నారింజను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని రసంలో ఎక్కువ శాతం ఎండిపోతుంది. అందుకే నారింజ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నారింజ తొక్కపై మరకలు ఏర్పడి దాని రుచి కూడా చెడిపోతుంది. నారింజ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం కంటే బయట పెడితేనే బాగుంటాయి.

బ్రెడ్:
ఇది చదివి మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ బ్రెడ్‌ను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే దానిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచి మారడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా హాని కలుగుతుంది.

తేనె:
తేనెను అస్సలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. తేనెను ఒక జాడిలో పోసి మూసి ఉంచితే, అది సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది. దీనిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది స్ఫటికంగా మారుతుంది. అంతే కాకుండా సీసా నుండి బయటకు తీయడం కష్టం అవుతుంది.

బంగాళ దుంపలు:
ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బంగాళదుంపలోని స్టార్చ్ చక్కెరగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అంతే కాకుండా ఇది దాని రుచిని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే బంగాళదుంపలను అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడదు.

Also Read: వేసవిలో ఇవి తింటే.. ఫుల్ ఎనర్జీ

పుచ్చకాయ:
పుచ్చకాయను ఫ్రిజ్‌లో కూడా ఉంచకూడదు. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని పోషకాలు నశిస్తాయి. వీలైనంత వరకు పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టకుండా ఉండటం మంచిది.

కాఫీ:
కాఫీని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కాఫీ ఇతర పదార్థాల వాసనను పీల్చుకుని అది త్వరగా చెడిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లో కాఫీ పెట్టకూడదు

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×