BigTV English

Vidaamuyarchi OTT release : నెలలోపే ఓటీటీలోకి ‘విదాముయార్చి’… స్ట్రీమింగ్ డేట్ ఇదే ?

Vidaamuyarchi OTT release : నెలలోపే ఓటీటీలోకి ‘విదాముయార్చి’… స్ట్రీమింగ్ డేట్ ఇదే ?

Vidaamuyarchi OTT release : తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). ఈ మూవీ ఈ నెలలోనే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ అయ్యి నెల కూడా పూర్తికాక ముందే ఓటీటీకి అడుగు పెడుతున్నట్టుగా టాక్ నడుస్తోంది.


నెలలోపే ఓటీటీలోకి ‘విదాముయార్చి’

తమిళ స్టార్ తల అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ (Trisha Krishnan) జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విదాముయార్చి’. ఈ మూవీని ముందుగా 2025 పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడి, ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్, విష్ణు ఎదవన్, అరివు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్’ ఆధారంగా రూపొందింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలను నిండా ముంచింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కంటే తక్కువ కలెక్షన్స్ సాధించి, భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తెలుగులో ‘విదాముయార్చి’ మూవీ ‘పట్టుదల’ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. కానీ ఈ డబ్బింగ్ వర్షన్ ను తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ఆదరణ దక్కలేదు.

నిజానికి అజిత్ కి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆయన అభిమానులు కూడా ఈ మూవీని పట్టించుకోకపోవడం గమనార్హం. ‘విదాముయార్చి’ మూవీ ఫిబ్రవరి 28న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందనేది లేటెస్ట్ టాక్. నిజానికి సినిమాలన్నీ చాలావరకు థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ‘విదాముయార్చి’ని మాత్రం కేవలం 3 వారాల్లోనే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కానీ నెట్ ఫ్లిక్స్ ఇంకా ‘విదాముయార్చి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

‘విదాముయార్చి’ స్టోరీ ఇదే

సినిమాలో అర్జున్ సర్జా, కాయల్ అనే లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుంటారు. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకోవాలని అనుకుంటారు. అయితే అర్జున్ కు భార్య నుంచి విడిపోవడం ఇష్టం ఉండదు. కానీ ఆమె మాటకు విలువిచ్చి ఒప్పుకుంటాడు. చివరిసారిగా భార్యతో కలిసి ఓ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. మధ్యలో సడన్ గా కారు ఆగిపోతుంది. అలాంటి టైంలో హెల్ప్ కావాలంటూ ఓ అపరిచిత జంట వాళ్ళ దగ్గరకు వచ్చి కాయల్ ను తమతో పాటు తీసుకెళ్తారు. మరి ఈ భార్యాభర్తలిద్దరి మధ్య విడాకులకు కారణమేంటి? కాయల్ ఎలా మాయమైంది? ఈ మిస్టరీని అర్జున్ ఎలా సాల్వ్ చేశాడు? చివరికి అర్జున్ కు కాయల దొరికిందా లేదా ? అనేది కథ.

Related News

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

Big Stories

×