Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 ) భాగంగా.. ఇవాళ మూడవ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్ లో… దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ… ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆఫ్గనిస్తాన్ మొదట బౌలింగ్ చేయబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( South Africa ) మధ్య జరుగుతున్న మూడవ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ( Karachi, National Stadium ) జరగనుంది.
Also Read: Pakistan Fans Supports IND Team: పరువు తీసుకుంటున్న పాక్ ఫ్యాన్స్.. రోహిత్ సేననే తోపు అంటూ !
అయితే కరాచీలోని నేషనల్ స్టేడియం… పిచ్ మొత్తం మొదట బ్యాటింగ్ చేసిన వారికి అనుకూలంగా.. ఉంటుందని చెబుతున్నారు. ఈ తరుణంలోనే… ఇవాళ్టి మ్యాచ్ లో టాస్ గెలిచి.. మొదటగా బ్యాటింగ్ చేయాలని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా టెంబా బావుమా నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ గా హష్మతుల్లా షాహిదీ ఉంటున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరిగే అన్ని మ్యాచ్ లు.. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇవాళ జరిగే దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఫైట్ కూడా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ ప్రక్రియ 2 గంటలకు ఉంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరిగే అన్ని మ్యాచ్ లు.. జియె హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, న్యూస్ 18 లో మనం చూడొచ్చు. అయితే.. జియె హాట్ స్టార్ లో మాత్రమే రిచార్జ్ చేయించుకుంటేనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చూడొచ్చు.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వన్డే రికార్డుల విషయానికి వస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 3 మ్యాచ్ లలో… దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అలాగే… 2 మ్యాచ్ లలో… ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. అంటే.. ఈ మ్యాచ్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా గెలిచే ఛాన్సులు ఎక్కువ అంటున్నారు. మరి ఇవాళ ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
Also Read: Yuzvendra Chahal- Dhanashree Verma: విడాకులు తీసుకున్న చాహల్, ధన శ్రీ..రూ.60 కోట్లు తీసుకుని మరీ !
జట్లు:
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (w), టోనీ డి జోర్జి, టెంబా బావుమా ( కెప్టెన్ ), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి