Hari Hara Veera Mallu Song: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో పవన్ బిజీ అయిపోవడంతో తను పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ పెండింగ్‌లో పడ్డాయి. అందులో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క హిస్టారికల్ సినిమాలో కూడా పవన్ నటించలేదు. పైగా ఈ మూవీలో తన గెటప్, అప్పీయరెన్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, దీనిని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇంతలోనే వారి అంచనాలను మరింత పెంచడానికి మరొక పాటను వదిలారు మేకర్స్.
ప్రమోషన్స్ మొదలు
ఏఏమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రమే ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా కోసం రాజకీయాలను కాస్త పక్కన పెట్టి ఇటీవల దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. దీంతో మూవీ టీమ్ అంతా ధైర్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. అంతే కాకుండా మార్చిలో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అందులో భాగంగానే ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ నుండి ఒక పాట విడుదలయ్యి ప్రేక్షకులను అలరించగా తాజాగా రెండో పాట కూడా విడుదలయ్యింది.
ప్రోమో విడుదల
‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఉన్న పోస్టర్‌ను విడుదల చేస్తూ ‘కొల్లగొట్టినాదిరో’ అనే సాంగ్ అందరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఇది హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమ పాట అనుకున్నారు ప్రేక్షకులు. తాజాగా విడుదలయిన ప్రోమో చూసిన తర్వాత ఇదొక స్పెషల్ సాంగ్ అనే విషయం క్లారిటీ వస్తుంది. మంగ్లీ వాయిస్‌తో, అదిరిపోయే బీట్స్‌తో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే లిరిక్స్‌తో పాట ప్రోమో విడుదలయ్యింది. ఇక ఈ ప్రోమో చివర్లో అనసూయతో పాటు తెలుగమ్మాయి పూజిత పొన్నాడ కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read: అల్లు అర్జున్‌తో పనిచేయడం నేను మోస్ట్ లక్కీగా ఫీలవుతా.!
అనసూయ అప్పీయరెన్స్
‘హరి హర వీరమల్లు’లో అనసూయ (Anasuya) స్పెషల్ సాంగ్ చేసిందని అప్పట్లోనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయం గురించి మూవీ టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఉన్నట్టుండి ‘కొల్లగొట్టినాదిరో’ ప్రోమో సాంగ్‌లో అనసూయ కనిపించడంతో ఫ్యాన్స్‌లో కొత్త జోష్ వచ్చింది. అనసూయ ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చాలాకాలం అయ్యింది. తను స్పెషల్ సాంగ్ చేస్తుందంటే చాలు.. దానిని వెండితెరపై చూడడం కోసం చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ‘కొల్లగొట్టినాదిరో’ ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది.