BigTV English

OTT Movie : ఆన్లైన్లో అందాల భామలు… సొల్లు కారిస్తే అంతే సంగతులు

OTT Movie : ఆన్లైన్లో అందాల భామలు… సొల్లు కారిస్తే అంతే సంగతులు

OTT Movie : ఈరోజుల్లో టెక్నాలజీ తో పోటీపడి బ్రతుకుతున్నారు మనుషులు. ఈ టెక్నాలజీ తో ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో అబ్బాయిల వీక్నెస్ లను కొంతమంది క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందమైన అమ్మాయిలను వాడి, వాళ్ళ న్యూడ్ వీడియోలతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ వలలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ (Zee 5) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ వెబ్ సిరీస్ పేరు ‘వీడియో క్యామ్ స్కామ్’ (Video Cam Scam). ఈ వెబ్ సిరీస్ కి  వైభవ్ ఖిస్తీ దర్శకత్వం వహించారు.  ఇందులో రజనీష్ దుగ్గల్, అమృతా ఖాన్విల్కర్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఫర్నాజ్ శెట్టి, కుంజ్ ఆనంద్, ఆరాధనా శర్మ కీలక పాత్రల్లో నటించారు. డేటింగ్ యాప్ లో చిక్కుకొని, ఇబ్బంది పడే వారి చుట్టూ స్టోరీ తిరుగుతుంది.  2024 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

టిల్లు, సోనీ, స్వీటీ ముగ్గురు కలిసి డబ్బులు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతారు. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఒక డేటింగ్ యాప్ ని క్రియేట్ చేసి, న్యూడ్ వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే వీళ్ళకు డబ్బులు కూడా వస్తుంటాయి. ఒక హ్యాకర్ ను పెట్టుకొని ఇదంతా చేస్తుంటారు. సోనీ, స్వీటీ లెస్బియన్స్ గా ఉంటారు. మరోవైపు వినయ్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో చిక్కుకుంటాడు. వర్క్ ప్రెజర్ లో భార్యకి దూరంగా ఉండటం వల్ల, ఒకరోజు తాగిన మత్తులో ఈ యాప్ లోకి లాగిన్ అవుతాడు. అప్పుడు వాళ్ళు వీడియోలు మార్ఫింగ్ చేసి చాలా అసభ్యంగా చిత్రీకరిస్తారు. దానిని చూసిన పోలీస్ ఆఫీసర్ భార్య కూడా చాలా బాధపడుతుంది. ఆ తరువాత మిగతా సభ్యుల్లాగానే వినయ్ కూడా వాళ్లకి డబ్బులు సమర్పించుకుంటాడు.

అంతటితో ఆగకుండా పోలీస్ ఆఫీసర్ అని తెలిసి కూడా వాళ్ళు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత స్టోరీ మారిపోతుంది. పోలీస్ ఆఫీసర్ భార్య కూడా ఒక హ్యాకర్ కావడంతో, భర్తని ఇబ్బంది పెడుతున్న వాళ్ల పని పట్టాలని చూస్తుంది. చివరికి ఆమె నిందితులను పట్టుకుంటుందా? పోలీస్ ఆఫీసర్ ఇందులో నుంచి బయటపడతాడా? వాళ్ల ఉచ్చులో ఇంకా ఎంతమంది బలవుతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వీడియో క్యామ్ స్కామ్’ (Video Cam Scam) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ వెబ్ సిరీస్ ని చూడండి. ఈ రోజుల్లో ఇటువంటి యాప్ లతో చాలా మోసాలు జరుగుతున్నాయి. వీటికి సొల్లు కారిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×