రాజకీయాల్లో హుందా తనం అనేది ఎప్పుడో పోయింది. ఇప్పుడు మరింత నీచ స్థాయికి దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు మరింత చౌకబారుగా మారిపోతున్నాయి. ఎక్కడో జరిగిన వీడియోలను తీసుకొచ్చి ఆయా పార్టీల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు. తాజాగా జనసేన ఆవిర్భావ సభను టార్గెట్ చేసుకుని చిల్లర రాజకీయాలు మొదలు పెట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
https://x.com/GreggTheEgg అనే ఎక్స్ అకౌంట్ నుంచి జనసేన గురించి ఓ ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన కార్యకర్తలను కుక్కల్లా చూస్తున్నారని, వారికి అత్యంత దారుణంగా భోజనం పెట్టారని ఓ వీడియోను(https://x.com/GreggTheEgg/status/1900483314810847678) షేర్ చేశారు. ఇందులో నేల మీద కవర్లు పరిచి ఇంత అన్నం, పప్పు వడ్డిస్తున్నట్లుగా కనిపించింది. నిజంగా ఈ వీడియో చూస్తే, మరీ ఇంత దారుణంగా జనసేన కార్యకర్తలు ఫుడ్ పెట్టారా? అనేలా ఉంది. కానీ, ఈ వీడియో వెనుకున్న అసలు కథ మరొకటి.
బంగ్లాదేశ్ ఘటన జనసేనకు లింక్
వాస్తవానికి ఈ ఘటనకు జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. అత్యంత దారుణంగా భోజనం వడ్డించిన ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన సమయంలో చాలా నానా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందించాయి. అందరినీ కూర్చోబెట్టి వారికి భోజనం వచ్చించాయి. తినడానికి తిండే దొరికే పరిస్థితి లేని సమయంలో కవర్లలో భోజనం పెట్టించుకుని మరీ తిన్నారు. ఏదో ఒకటి, ఎలాగోలా తిని కడుపు నింపుకోవడమే ముఖ్యం అనుకున్నారు అక్కడి బాధితులు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను తీసుకొచ్చి జనసేన సభతో లింక్ పెట్టి, ఆ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేశారు కొంత మంది నెటిజన్లు. కానీ, ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని సదరు వీడియోను https://x.com/GreggTheEgg అనే అకౌంట్ నుంచి డిలీట్ చేశారు.
Street food in Bangladesh. pic.twitter.com/bMaWyZfMYY
— RadioGenoa (@RadioGenoa) March 13, 2025
Read Also: పార్టీ పెట్టాలంటే.. నాన్న సీఎం అవ్వాలా? జగన్ ‘కార్పొరేటర్’ కామెంట్స్‌కు పవన్ పంచ్
జనసేనకు వ్యతిరేకంగా @GreggTheEgg ప్రచారం
వాస్తవానికి ఈ @GreggTheEgg అనే ఎక్స్ వేదికపై జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. తీవ్రమైన పదజాలంతో ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఎడిటెడ్ వీడియోలతో ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో జరిగిన స్ట్రీట్ ఫుడ్ వీడియోను జనసేన సభలో జరిగినట్లు ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై నెటిజన్లతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. విమర్శలు చేయడంతో తప్పులేదు. కానీ, మరీ ఇంత చీప్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటున్నారు. విమర్శలు కూడా హుందాగా చేయడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరికొంత మంది జనసేన కార్యకర్తలు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్న ఎక్స్ అకౌంట్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు.. 21 మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టాం – వైసీపీకి పవన్ చురకలు