BigTV English
Advertisement

OTT Movie: తండ్రినే చంపే కొడుకు… మైనర్ గా ఉంటూనే క్రైమ్… మైండ్ పోయే ట్విస్ట్ లు

OTT Movie: తండ్రినే చంపే కొడుకు… మైనర్ గా ఉంటూనే క్రైమ్…  మైండ్ పోయే ట్విస్ట్ లు

OTT Movie : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలని కుర్చీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ ఒక సైకో చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (jio hotstar) లో

ఈ మూవీ పేరు ‘విన్చి డా'(Vinci Da). 2019లో విడుదలైన ఈ బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రుద్రనీల్ ఘోష్, రిత్విక్ చక్రవర్తి, అనిర్బన్ భట్టాచార్య, రిద్ధి సేన్, సోహిని సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక ప్రతిభావంతుడైన మేకప్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతని కళను ఒక సైకోపాత్ న్యాయవాది, నేరాలు చేయడం కోసం ఉపయోగించుకుంటాడు. ఈ మూవీ నైతికత, న్యాయం, కళాకారుడి ఆంతరంగిక సంఘర్షణను చూపిస్తుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కథ విన్చి డా అనే మేకప్ ఆర్టిస్ట్‌తో మొదలవుతుంది. అతను తన తండ్రి నుండి ప్రొస్థెటిక్ మేకప్ కళను నేర్చుకున్నాడు. అతను తన ప్రతిభను సినిమాలలో ప్రదర్శించాలని కలలు కంటాడు, కానీ అవకాశాలు లేకపోవడంతో నిరాశకు గురవుతాడు. అతని ప్రేమికురాలు జయ మాటిమాటికి తడబడే అమ్మాయి. ఇదే సమయంలో ఆది బోస్ అనే వ్యక్తి జైలు నుండి విడుదలవుతాడు. ఆది ఒకప్పుడు తన తండ్రిని చంపిన సంఘటన కారణంగా మానసిక ఆసుపత్రిలో ఉంటాడు. ఇప్పుడు అతను తనను తాను సీరియల్ లాయర్గా భావిస్తాడు. అంటే న్యాయం కోసం నేరాలు చేయవచ్చని నమ్ముతాడు. అతను విన్చి డాను సంప్రదించి, ఒక వ్యాపారవేత్త శ్యామ్ సుందర్ జైస్వాల్ ముసుగును తయారు చేయమని కోరతాడు.అలా చేస్తే సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని చెప్తాడు. ఆది ఈ ముసుగును ఉపయోగించి బ్యాంకును దోచుకుంటాడు. ఈ క్రమంలో ఒక భద్రతా సిబ్బందిని చంపుతాడు.

విన్చి డా తన కళ నేరానికి ఉపయోగపడిందని తెలుసుకుని బాధపడతాడు. ఆది అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి, మరిన్ని ముసుగులు తయారు చేయమని ఒత్తిడి చేస్తాడు. రెండవసారి, ఒక రాజకీయ నాయకుడి కొడుకు ముసుగును తయారు చేయిస్తాడు, ఆ ముసుగుతో ఆది నిరాశ్రయులపై కారును నడిపి వారిని చంపుతాడు. మూడవసారి, ఒక అత్యాచార నిందితుడి ముసుగును తయారు చేయిస్తాడు, ఆ ముసుగుతో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి, ఆ వీడియోను మీడియాకు విడుదల చేస్తాడు. ఆ అమ్మాయి వేరెవరో కాదు, విన్చి డా ప్రేమికురాలు జయ.ఇది జరిగాక జయ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అదేసమయంలో విన్చి డా ఆమెను కాపాడతాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న విన్చి డా, ఆది బోస్‌ను విషంతో చంపుతాడు. ఆ తర్వాత ఆది ముసుగును ధరించి, ఆది తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో తీస్తాడు. అయితే, ఇన్‌స్పెక్టర్ బిజోయ్ పొడ్డార్ ఈ వీడియోలోని గొంతు తేడాను గుర్తిస్తాడు. విన్చి డాను ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేయడానికి వస్తాడు. చివరికి ఈ నేరాన్నివిన్చి డా ఒప్పుకుంటాడా అనే విషయాన్ని తెలుసు కోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి.

 

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×