తిరుపతి వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ
తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ పాలన ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ప్రతిరోజు నగర పాలక సంస్థ అక్రమాలు, తిరుమలలో అక్రమ వ్యాపారాలు, తిరుపతి స్మార్ట్ సిటినిధుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎన్నికల అస్త్రంగా కూడా కూటమి నేతలు వాటిని వాడుకున్నారు. వాటిలో అత్యంత ముఖ్యమైంది, టీడీపీ ప్రధానంగా టార్గెట్ చేసింది స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నమ్మిన బంటుకి లీజుకు ఇచ్చిన మెరీడియన్ హోటల్..
తిరుమలలో అడ్డదిడ్డంగా మంజూరు చేసిన తట్టలు
తిరుమలలో అడ్డదిడ్డంగా మంజూరు చేసిన తట్టలు, తిరుపతి నగరపాలక సంస్థలో అక్రమంగా దొడ్డి దారిని ప్రవేశించిన అధికారులు, టిటిడిలో డిప్యూటేషన్ పై కొనసాగుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తాం.. వారిని వెంటనే బయటకు పంపుతామని వార్నింగులు ఇచ్చారు. మెరీడియన్ హోటల్ నిర్మాణం ఎన్జీఓ కాలనీ స్థలంలో కట్టారని, దీని వల్ల కపిల తీర్థం సర్కిల్ లో ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారి, భక్తులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే కూల గొట్టిస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్నారు. ఇతరుల లీజుపై తీసుకున్న తిరుమల సారంగి హోటల్ కు రీటెండర్లు పిలుస్తామని, తిరుమలలో గాజు సీసాల వినియోగం రద్దు చేస్తామని, ఆ టెండర్ల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వైసిపి వారు లబ్ధిపోందుతున్నారంటూ వీరంగం వేసారు.
యువనాయకుడి రక్షణలో వైసీపీ శ్రేణుల కార్యకలాపాలు
ప్రస్తుతం పరిస్థితి చూస్తే అంతా రివర్స్‌లో కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఎన్నికల ప్రచారంలో పలికిన ప్రగల్భాల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. తిరుపతికి చెందిన ఓ యువనాయకుడు వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోకుండా .. మొత్తం వ్యహారాన్ని నడిపిస్తున్నాడంట. అయన సమీప బంధువు లోపాయి కారీగా తనకున్న పలుకుబడితో అతనికి సహాయపడుతున్నాడంట. జనసేన ముసుగులో వైసీపీ వారి వ్యాపారాలకు రక్షకుడిగా ఉన్నాడంట. మెరోడీయన్ హోటల్ మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నాడంట.
ఫుట్ పాత్ వ్యాపారుల వద్ద మామూళ్ల వసూలు
దాంతో పాటు తిరుమలలోని అఖిలాండం వద్ద వైసిపి వారికి తట్టలు పెట్టించాడంట. మరో వైపు సారంగి హోటల్‌కు కూడా అతనే సంధానకర్తగా ఉంటున్నాడంట. వైసిపి వారంతా ఇప్పుడు ఆ యువనాయకుడి రక్షణలో తమ కార్యకలాపాలు వచ్చలవిడిగా కానిస్తున్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే పీఏ కూడా తిరుపతి నగర పాలక సంస్థలో బదిలీ అయిన వారిని మదర్ డిపార్ట్‌మెంట్ కు పంపకుండా చక్రం తిప్పుతున్నాడంట. ఆడిట్ డిపార్ట్ మెంటు నుంచి వచ్చిన ఓ అధికారికి బదిలీ అయిన ఏడు నెలలు అయినప్పటికి అయన ఇంకా అక్కడే కొనసాగుతున్నాడు. ఆయనకు ఓ ఉన్నతాధికారి సహకారం కూడా ఉందంటున్నారు. దీంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వైసీపీ నాయకుల అనుచరుల గడువు ముగిసినప్పికీ.. వారినే ఆఉన్నతాధికారి కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రోడ్ సైడ్ హోటళ్లని పార్కింగ్ ప్లేసులుగా మార్చి దందాలు
ఫుట్ పాత్ వ్యాపారుల వద్ద మామూళ్లు కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారంట. తిరుమలకు కాలినడకన వెళ్ళే భక్తులు తిరుపతి బస్టాండ్ నుంచి కపిల తీర్థం సర్కిల్ , అలిపిరి మీదుగా వెళుతుంటారు. ఆ ప్రాంతాల్లో రోడ్‌సైడ్ హోటళ్లని వారు అక్రమించుకుని పార్కింగ్ ప్లేసులుగా మార్చారు. ఓ వరస కాకుండా రెండు వరసలుగా పార్కింగ్ ఉంటుంది. దాంతో పాద యాత్రికులు బిక్కు బిక్కు మంటూ నడవాల్సి వస్తోంది. ఇక స్థానిక హోటల్స్ నుంచి ఓ నాయకుడు చిల్లర వసూలు చేస్తున్నాడంట.ప్రతి డివిజన్ లోని స్టే హోంల నుంచి నాయకులు దండుకుంటున్నారంట.
భూమనకు కౌంటర్ ఇవ్వడానికి సాహసించని కూటమి నేతలు
మొత్తం ఆ యువ నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతోందని.. ఆయన వైసీపీ అ్రకమార్కులకు రక్షణ కల్పిస్తున్నాడని తిరుమల తిరుపతిలోని టీడీపీ క్యాడర్ అవేదన వ్యకం చేస్తుంది.. ప్రభుత్వం మీదా రోజుకోక రీతిలో భూమన్ అభినయ్ రెడ్డి, అయన తండ్రి కరుణాకర్ రెడ్డి విమర్శలు చేస్తూ.. ఆందోళనలు నిర్వహించాలని చూస్తుంటే.. కూటమి నేతలు కనీసం నోరు విప్పి కౌంటర్లు ఇవ్వకుండా వైసీపీ శ్రేణులకు సహకరిస్తుండటం విమర్శలపాలు అవుతోంది.
తిరుపతి మేయర్ అవిశ్వాసం విషయంలో సైలెన్స్
4 సంవత్సరాలు పూర్తయినా మేయర్ అవిశ్వాసము విషయంలో నోరు మెదపకుండా ఉన్నారని … టిడిపిలోని ఓ నాయకుడు మేయర్‌కు అండదండలు అందిస్తున్నారని వైసీపీ నుంచి టిడిపి, జనసేనలో చేరిన కార్పొరేటర్లు బహిరంగంగానే అంటున్నారు. మొత్తమ్మీద తిరుపతి నాయకుల పై చర్య తీసుకోకుంటే పార్టీ పరువు నానాటికి దిగజారి పోతుందని, స్థానిక సంస్థల ఎన్నికలపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.