BigTV English
Advertisement

OTT Movie : చేయని తప్పుకు బలిపశువులుగా… ఈ పోలీసుల అరాచకం చూస్తే రక్తం మరగాల్సిందే మావా

OTT Movie : చేయని తప్పుకు బలిపశువులుగా… ఈ పోలీసుల అరాచకం చూస్తే రక్తం మరగాల్సిందే మావా

OTT Movie : నరాలు కట్ అయ్యే లాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో నడుస్తోంది. అద్భుతమైన నటన, గట్టి స్క్రీన్‌ప్లే ఈ సినిమాని తమిళ ఇండస్ట్రీలో ఒక మాస్టర్‌పీస్‌గా చేశాయి. ఇది ఒక క గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు “విసారణై” (Visaranai). 2016లో విడుదలైన ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ధనుష్ కి చెందిన వుండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించబడింది. ఎం. చంద్రకుమార్ రాసిన “లాక్ అప్” అనే నవల ఆధారంగా రూపొందింది. ఇది నిజ జీవిత ఘటనలను ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో దినేష్, సముద్రకని, ఆనంది, ఆడుకలం మురుగదాస్, కిషోర్, ప్రదీష్ రాజ్, సిలంబరసన్ రత్నసామి నటించారు. ఈ చిత్రం 72వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒరిజోంటి విభాగంలో ప్రీమియర్ అయింది. అక్కడ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటాలియా అవార్డును కూడా గెలుచుకుంది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తమిళ చలనచిత్రం, ఉత్తమ సహాయ నటుడు (సముద్రకని), ఉత్తమ ఎడిటింగ్ (కిషోర్ టీ.) అవార్డులను గెలుచుకుంది. ఇది 2016 ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుండి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. IMDbలో ఈ సినిమా 8.4/10 రేటింగ్‌ను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో, పాండి, మురుగన్, అఫ్సల్, కుమార్ అనే నలుగురు తమిళ వలస కార్మికులు ఒక స్థానిక దుకాణంలో పనిచేస్తూ, ఒక పార్కులో నివసిస్తుంటారు. పాండి, ఒక పోలీసు అధికారి ఇంట్లో పనిచేసే శాంతి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఒక రోజు, స్థానిక ప్రముఖుడి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో, ఈ నలుగురిని పోలీసులు అనుమానితులుగా అరెస్టు చేస్తారు. విశ్వేశ్వర రావు అనే ఒక శాడిస్ట్ ఇన్స్పెక్టర్ వారిని ఒక నేరాన్ని ఒప్పుకోమని దారుణంగా కొడతాడు. అయినప్పటికీ వాళ్ళు ఆ నేరం చేయలేదని మొత్తుకుంటారు. ఈ దృశ్యాలు అత్యంత కఠినంగా చిత్రీకరించబడ్డాయి.  పాండి దీనికి ఒప్పుకోకపోయినా, అతని స్నేహితులు ఒత్తిడికి లొంగిపోతారు.

వీళ్ళు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత కూడా విశ్వేశ్వర రావు వీళ్ళని ఒక రాజకీయ ఎన్‌కౌంటర్‌లో చంపాలని ప్లాన్ చేస్తాడు. కానీ ముత్తువేల్ అనే ఒక నిజాయితీ పోలీసు అధికారి వారిని రక్షిస్తాడు. వారిని తమిళనాడుకు తిరిగి పంపిస్తాడు. తమిళనాడులో, పాండి అతని స్నేహితులు తాము స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తారు. కానీ వీళ్ళు మరొక ఉచ్చులో చిక్కుకుంటారు. ఈసారి వీళ్ళు కే.కే. అనే ఆడిటర్‌తో కలిసి, ఒక ఫేక్ కేసులో నిందితులుగా మారుతారు. ఇది రాజకీయ అవినీతిని కప్పిపుచ్చడానికి ప్లాన్ చేసిఉంటారు. ఆ తరువాత స్టోరీ పూర్తిగా మారిపోతుంది. పాండి అతని స్నేహితులు ఈ ఉచ్చులో నుంచి బయటపడతారా ? ప్రాణాలను వదులుకుంటారా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : 11 మంది అబ్బాయిలతో పార్టీ… ఒళ్ళు తెలీని టైంలో బలవంతం చేసే ఒక్కడు… అల్టిమేట్ ట్విస్టులున్న మలయాళ మూవీ

Related News

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

Big Stories

×