BigTV English
Advertisement

Uttam Kumar Reddy: భారతదేశంలోనే అగ్రగామిగా మన తెలంగాణ: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: భారతదేశంలోనే అగ్రగామిగా మన తెలంగాణ: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వానాకాలం ఇటు యాసంగి పంటలకు ప్రణాళికా బద్దంగా నీటిని అందించినందుకు అద్భుతమైన ఫలితాలు సాదించామన్నారు.


వ్యవసాయశాఖాధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసికున్నందునే తెలంగాణ రాష్ట్రం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి యావత్ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఖరీఫ్ పంటకు నీటి విడుదలతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఎస్.ఎల్.బి.సి పునరుద్దరణ, నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.  నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యా దాస్ నాధ్, నీటిపారుదల శాఖా సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఇ. ఎన్.సి లు అంజద్ హుస్సేన్,శ్రీనివాస్, రమేష్ బాబు తదితరులతో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడూతూ.. వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్ మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలులో పెట్టాలన్నారు. సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. నీటి విడుదల విషయమై నీటిపారుదల శాఖా మొత్తం దృష్టి కేంద్రీకరించి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలన్నారు. ఈ వర్షాకాలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల ముందస్తు బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రధాన అనకట్టలతో పాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు సన్నద్ధం కావాలని ఆయన ఆదేశించారు.


వర్షా కాలంలో సంభవించే అతి భారీ వర్షాలకు గండ్లు పడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తులు సంభవిస్తే తక్షణమే నష్టానివారణ చర్యలకు అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. అటువంటి విపత్తులు సంభవించిన పక్షంలో మిగిలిన శాఖాలతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తక్షణమే స్పందిస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ చర్యలు చెవుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సుమారు 10 కిలో మీటర్ల దూరం సొరంగమార్గం పనులు పూర్తి చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా మారనున్న ఎస్.ఎల్.బి.సి పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు

ఆధునిక పరిజ్ఞానంతో పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ)తో పాటు భారత భూగర్భ సర్వే సంస్థ(జీ. ఎస్.ఐ)ల సహకారంతో పనులు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. పునరుద్ధరణ పనులలో మునుముందు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు గాను చేయనున్న ఏరియల్ లిడార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ మేరకు ఎన్.జి.ఆర్.ఐ శాస్త్ర వేత్తలతో సమావేశం అయి సర్వేకు సంబంధించిన సాంకేతిక విధానాలను రూపొందించామన్నారు. పునరుద్ధరణ విషయంలో అయ్యో వ్యయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సొరంగం పనులలో అపారమైన అనుభవం కలిగిన మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ హర్బల్ సింగ్ ను నీటిపారుదల శాఖకు గౌరవ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆయన సాంకేతిక అనుభవంతో ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గంతో పాటు ఇతర సొరంగాలను పూర్తి చేసేందుకు దోహదపడతారని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.నీటి సామర్ధ్యం పెంపింకందించేందుకు చేపట్టిన పూడిక తీత పనులను మరింత వేగవంతం చేయాలన్నారు.వర్షాకాలంలో సంభవించే అతి భారీ వర్షాలతో ప్రమాదాలకు గురయ్యే వాటిని గుర్తించి అత్యవసరంగా పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్న నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి సంస్థలకు చెందిన భూముల ఆక్రమణకు గురయ్యాయని అటువంటి ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్ తో నీటిపారుదల శాఖా భూములన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు.ఏక్కడికక్కడ పురపాలక సంఘం,పొలీస్ అధికారులను ఈ డ్రైవ్ లో వినియోగించుకుని నీటిపారుదల శాఖా భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.

ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

ALSO READ: Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్

Related News

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×