Cult OTT:ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా, దర్శకుడిగా తనకంటూ పేరు సొంతం చేసుకున్నారు విశ్వక్ సేన్ (Vishwak sen) . అలాంటి ఈయన తాజాగా స్వీయదర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్ట్ (Cult). ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తో పాటు తారక్ పొన్నప్ప, గాయత్రీ భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్తో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ జెన్జీ యువతను టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం ఒక వర్గం వారికి మాత్రమే నచ్చింది . ఇందులో యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలు చూడలేకపోయారు.
స్క్విడ్ గేమ్, ఆపరేషన్ ఎక్స్ మూవీల తరహాలో వయలెంట్గా సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకవైపు థియేటర్లలో రన్ అవుతుండగానే.. మరొకవైపు ఓటీటీ స్ట్రీమింగ్ కి రానుందని సమాచారం . డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను నాలుగు వారాలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని డీల్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే నవంబర్ లాస్ట్ వారంలో ఈ సినిమా ఓటిటిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను తారక్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మించారు. కేజిఎఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
also read:త్రిగుణ్ కి కండీషన్ పెట్టిన భార్య?
డీఎస్పీ సంకల్ప్ పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. తన పద్ధతిలో నేరాలను అణిచివేసే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్.. రకరకాల క్రైమ్స్, వాటి వెనుక ఉన్న ముఖాలను ఎదిరించే క్రమంలో సంకల్ప్ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. శత్రువులను, ప్రమాదాలను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రయాణంలో అసలు రహస్యం ఏంటి? అనేది ఈ సినిమా కథాంశం. ఇండియాలో మొదటిసారిగా వచ్చిన స్లాషర్ ఫిలిం జోనర్ కావడంతో మేకింగ్ పరంగా కొత్త ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది..కానీ ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి భాగంలో విశ్వక్ సేన్ ఎంట్రీ కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉన్నప్పటికీ కథనం సాగే తీరు ప్రేక్షకులను కట్టిపడేయడంలో విఫలమయ్యింది. దర్శకుడిగా విశ్వక్ యాక్షన్ పై పెట్టిన శ్రద్ధ, బలమైన భాగోద్వేగాలపై ,కథనంపై పెట్టలేదని భావన కలుగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి దూరం కావడంతో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి అని చెప్పాలి. మరి థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇటు ఓటిటీలోనైనా ఆదరణ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.