E-Paper
Advertisement

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత
Advertisement

Philately Passport| సాధారణంగా పాస్‌పోర్ట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. కానీ బెంగళూరులో మాత్రం ఓ ప్రత్యేకమైన పాస్‌పోర్ట్ కోసం యువత అర్ధరాత్రి నుంచే పోస్టాఫీసు ముందు బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 2 గంటలకే వందలాది మంది క్యూలో నిలబడుతున్నారు. ఆశ్చర్యంగా ఉందా? అయితే వారు వెతుకుతున్నది విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగించే పాస్‌పోర్ట్ కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఈ చిన్న బుక్‌లెట్‌పై ఒక్కసారిగా ఆసక్తిని పెంచాయి. ఇంతకీ ఈ పాస్‌పోర్ట్ ప్రత్యేకత ఏమిటి? దీని కోసం యువత ఎందుకు ఇంతగా ఎదురుచూస్తున్నారు?

ఫిలాటెలీ పాస్‌పోర్ట్ అంటే..

ఫిలాటెలీ అంటే పోస్టల్ స్టాంప్స్ (తపాలా బిళ్లలు)ను సేకరించడం, వాటి గురించి తెలుసుకోవడం. భారత తపాలా శాఖ ఈ ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌ను అందిస్తోంది. ఇది చూడటానికి భారతీయ పాస్‌పోర్ట్‌లా ఉంటుంది. అయితే విదేశీ ప్రయాణాలకు దీనిని ఉపయోగించలేరు. ప్రత్యేక పోస్టాఫీసులను సందర్శించిన జ్ఞాపకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ బుక్‌లెట్‌లో మొత్తం 30 ఖాళీ పేజీలు ఉంటాయి. ఎంపిక చేసిన పోస్టాఫీసులను సందర్శించినప్పుడు అక్కడి అధికారిక ముద్రలు, తపాలా బిళ్లలను ఇందులో సేకరించవచ్చు. ఉదాహరణకు, బెంగళూరులోని హిస్టారికల్ (చారిత్రక) జనరల్ పోస్టాఫీసు లేదా హుబ్బళ్లిలోని ఖాదీ గ్రామోద్యోగ్ పోస్టాఫీసు సందర్శించవచ్చు. అక్కడి ప్రత్యేక ముద్రలను తమ పాస్‌పోర్ట్‌లో పొందవచ్చు.

సోషల్ మీడియా వీడియోలతో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్

Advertisement

ఈ ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌ని తపాలా శాఖ కొన్నేళ్ల క్రితమే ప్రారంభించింది. అయితే మొదట్లో దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇటీవల కొందరు ట్రావెల్ వ్లాగర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు దీన్ని కొనుగోలు చేసిన అనుభవాలను వీడియోల రూపంలో పంచుకున్నారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో యువతలో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రయాణాలు ఇష్టపడేవారు, స్టాంపులు సేకరించేవారు ఈ పాస్‌పోర్ట్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో బెంగళూరు ఫిలాటెలీ బ్యూరో వద్ద డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఉదయం కౌంటర్ తెరవకముందే టోకెన్ల పంపిణీ

బెంగళూరు జీపీఓ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటలకు కౌంటర్లు తెరవకముందే భారీగా జనం చేరుకుంటున్నారు. కొందరు తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య టోకెన్లు ఇస్తున్నారు. కౌంటర్లు తెరిచిన కొద్దిసేపటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్టులు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు స్థానిక పోలీసులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Also Read: రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి

కేవలం రూ.100కే స్పెషల్ పాస్‌పోర్ట్

ఈ పాస్‌పోర్ట్ ధర కేవలం రూ.100 మాత్రమే. అదనంగా రూ.200తో ఫిలాటెలీ డిపాజిట్ అకౌంట్ తెరిచి బ్యూరోలో శాశ్వత సభ్యత్వం పొందవచ్చని సమాచారం. విద్యార్థులు, ట్రావెల్ ఫ్యాన్స్ సహా ఆసక్తి ఉన్నవారు ఈ సేకరణ అలవాటు ప్రారంభించవచ్చు.

సోషల్ మీడియా ప్రభావంతో ఓ చిన్న బుక్‌లెట్ ఇప్పుడు ప్రయాణ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Also Read: బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్

Related News

వర్షాలు లేకపోయినా జలపాతాల్లో నీరు ఎలా? కర్రెగుట్టల్లో వింత ప్రకృతి అద్భుతం!

ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!

రన్‌వే పైకి దూసుకొచ్చిన శునకం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో ఘటన

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

Big Stories

Advertisement
×