OTT Movie : ఓటీటీలో హారర్ సినిమాలకు కొదవలేదు. అయితే బెంగాలీ హారర్ సినిమాలు మంచి కంటెంట్ తో వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ నుంచి చాలా కాలంగా, అనేక హారర్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని సినిమాలు ఊహకందని ట్విస్ట్లు, భయపెట్టే సీన్స్, ఉత్కంఠమైన స్టోరీలతో, ఓటీటీలో ఇప్పటికీ బెస్ట్ హారర్ సినిమాలుగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. బెంగాలీ బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలి అనుకుంటే, క్రింది వాటిని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాలన్నీ బింగే (Binge) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
భెంగ్చి (Bhengchi)
నిర్బన్ అనే వ్యక్తి తన భార్య మలబికను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఆమె చనిపోయాక అలియా అనే యువతితో ప్రేమలో పడతాడు. అయితే అతను తన భార్యను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ, అలియాతోనే కలసి ఉంటాడు. ఆ తరువాత స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. ఈ మూవీకి క్రిశానూ గంగూలీ దర్శకత్వం వహించారు. ఇందులో అంకిత్ దేవ్ అర్పాన్, అమృత చటోపాధ్యాయ్, అపరాజిత ఘోష్ దాస్, జోయ్‌దీప్ ముఖర్జీ, దేబ్రంజన్ నాగ్, కౌశిక్ సేన్ వంటి నటులు నటించారు.
లాల్ షాహెబర్ కుఠి (Lal Shaheber Kuthi)
తన స్నేహితుడితో కలిసి, వెళ్ళిన సోదరి, ఆమె స్నేహితులు కనిపించకుండా పోవడంతో, వాళ్ళను వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. సుదీప్ ఘటక్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో జయశ్రీ ముఖర్జీ, సుమన్ బెనర్జీ, శర్మిష్ట నాగ్, మౌమిత గుప్తా వంటి నటులు ఉన్నారు.
బోనోలోటా (Bonolota)
ఈ స్టోరీ ఒక పాడుబడిన ఇంటిలోకి మొదటి రాత్రి జరుపుకోవడానికి వచ్చిన ఒక నూతన జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఆ ఇంట్లో ఫస్ట్ నైట్ ని కెమరాలో రికార్డ్ చేయాలని అనుకుంటారు. అప్పుడే అ ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. ఈ సినిమాకు రిక్ బసు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సౌమ్యో ముఖర్జీ, సుస్మితా డే, అంగ్షుమాన్ పరాసర్, దేబ్దత్ ఘోష్ వంటి నటులు నటించారు.
కలర్ ఆఫ్ ఫియర్ (Color of fear)
రాహుల్ చక్రవర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ స్టోరీ నూతన సంవత్సర వేడుకలను, ఒక కొత్త ప్రదేశంలో గడపాలని కోరుకునే యువకుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు రాత్రి గడపడానికి మంచి ప్లేస్ కోసం వెతుకుతుంటారు. అయితే న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నప్పుడు, స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యం అవుతుంటారు. ఈ సన్నివేశాలు ఒంట్లో వణుకు పుట్టిస్తాయి.
Read Also : పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయి… అబ్బాయిలకు ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ ఎక్స్పీరియన్స్