E-Paper
Advertisement

మరో యువకుడితో సన్నిహితంగా ప్రేమించిన అమ్మాయి… అచ్చమైన కోనసీమ ప్రేమకథ

మరో యువకుడితో సన్నిహితంగా ప్రేమించిన అమ్మాయి… అచ్చమైన కోనసీమ ప్రేమకథ
Advertisement

Romantic Love Story : పూర్వ కాలంలో పెళ్ళిళ్ళు మొహాలు చూసుకోకుండా చేసుకునే వారు అన్న విషయాన్ని మనమందరం ఎక్కడో ఒక చోట వినే ఉంటాము. కానీ ఇప్పటి కాలంలో అలాంటివి కనీసం ఊహించగలమా ? అయితే మనం చెప్పుకోబోయే సినిమాలో హీరో మాత్రం ఏకంగా హీరోయిన్ ను మొహం చూడకుండానే ప్రేమిస్తాడు. అంతేకాదు ఆమెను వెతుక్కుంటూ, మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలాంటి టైమ్ లో వస్తుంది చూడు ట్విస్ట్… ఇది అచ్చతెలుగు సినిమానే. ఇటీవలే వచ్చిన ఈ సినిమా పేరు ‘కొత్త మలుపు’ (Kotha Malupu). 2026లో విడుదలైన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ హైదరాబాద్‌లో సాగుతుంది. ఎలాంటి బాధ్యతలు లేకుండా స్నేహితులతో కలిసి లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసే అవారా కుర్రాడు కమల్. అతని లైఫ్ స్టోరీనే మూవీ. తన ఫ్యామిలీలో జరిగే ఒక పెళ్లి వేడుక కోసం కమల్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అందమైన పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ పెళ్లి సందడిలో హడావిడి చేసే వరలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఒకరోజు రాత్రి కమల్ అనుకోకుండా ఒక పెద్ద అవమానకరమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో ఒక అపరిచిత యువతి అతడిని కాపాడి సురక్షితంగా బయట పడేస్తుంది. అంటే చీకట్లో ఆ అమ్మాయి మొహాన్ని సరిగ్గా చూడడు.

Advertisement

తనను ఆ కష్టం నుంచి గట్టెక్కించిన ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడానికి కమల్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ వెతుకులాటలో వరలక్ష్మి కూడా కమల్‌ కు హెల్ప్ చేస్తుంది. కలిసి ప్రయాణించే క్రమంలో కమల్, వరలక్ష్మిల మధ్య ప్రేమ చిగురిస్తుంది. తీరా తనను ఆ రాత్రి కాపాడిన అమ్మాయి మరెవరో కాదు, తను ప్రేమిస్తున్న వరలక్ష్మినే అని కమల్‌కు తెలుస్తుంది. కానీ అలా తెలిసే సమయానికి కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. వరలక్ష్మి వేరే యువకుడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటో కమల్ కంట పడుతుంది. దీంతో కమల్ మనసులో వరలక్ష్మిపై తీవ్రమైన అనుమానాలు, అపార్థాలు మొదలవుతాయి. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న యువకుడు ఎవరు ? వరలక్ష్మికి ఉన్న గతం ఏంటి ? కమల్ తన అనుమానాలను పక్కన పెట్టి, ఒక వ్యక్తి గతాన్ని చూసి కాకుండా ప్రస్తుతాన్ని బట్టి ఎలా అర్థం చేసుకున్నాడు ? చివరికి వీరిద్దరి ప్రేమకథ ఎలా గెలిచింది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనే స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా ‘కొత్త మలుపు’. ఆకాష్ గోపరాజు, భైరవి ఆర్థ్యా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా జూలై 06 నుండి డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక అందమైన ప్రేమకథ. ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది, కానీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అన్న సందేశమే ఈ మూవీ.

Advertisement

Read Also: మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా

Related News

జంతువులను చంపే వింత కిల్లర్… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త కంటెంట్… 2 సినిమాలు, 2 సిరీసులు తెలుగులోనే

40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

బ్రేకప్ అయిన వాళ్ళంతా రెండో ఛాన్స్ కోసం… రమ్యకృష్ణ క్రేజీ రియాలిటీ షో… అన్నీ అలాంటి షోలే

అమ్మాయిని వెంటాడే టైర్… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

హైవేల పక్కన 14 మంది మహిళల శవాలు… వెన్నులో వణుకు పుట్టించే రియల్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×