BigTV English

Wednesday Season 2 trailer : రెండు పార్టులుగా వస్తున్న ‘వెన్స్‌డే’ సీజన్ 2.. అదిరిపోయే ట్రైలర్‌‌తో కొత్త రిలీజ్ డేట్ రివీల్

Wednesday Season 2 trailer : రెండు పార్టులుగా వస్తున్న ‘వెన్స్‌డే’ సీజన్ 2.. అదిరిపోయే ట్రైలర్‌‌తో కొత్త రిలీజ్ డేట్ రివీల్

Wednesday Season 2 trailer : నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ పాపులర్ సిరీస్ లలో “వెడ్నెస్‌డే” కూడా ఒకటి. ఈ డార్క్ హర్రర్ థ్రిల్లర్ సీజన్ 2 రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో ట్రైలర్ తో ఆ రెండు పార్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న విషయంతో పాటు, పార్ట్ 1 లో ఏం జరగబోతోందో హింట్ ఇచ్చారు.


కొత్త ట్రైలర్ లో విశేషాలు
“వెడ్నెస్‌డే” సీజన్ 2 తాజా టీజర్ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. వెడ్నెస్‌ డే ఆడమ్ గా నటించిన జెన్నా ఓర్టెగా నెవర్‌మోర్ అకాడమీలో కొత్త సాహసాలు చేయడంతో పాటు మరింత భయంకరమైన అంశాలను, ఒక కొత్త అతీంద్రియ శక్తిని ఎదుర్కొంటుంది. ట్రైలర్ ఉన్న డైలాగులు, సీన్స్ చూస్తుంటే మొదటి భాగంలో సేఫ్ గా ఇంటికెళ్ళిన వెడ్నెస్‌ డే ఈ సీజన్ లో మాత్రం ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది. ఆమె ఇష్టపూర్వకంగా పాఠశాలకు తిరిగి రావడం ఈ సీజన్లో చూడవచ్చు. వాస్తవానికి ఆమె నెవర్‌మోర్‌కు తిరిగి రావడాన్ని “నేరం జరిగిన ప్రదేశానికి తిరిగి రావడం”తో పోలుస్తుంది. ట్రైలర్ లో మాత్రం ఆమె ప్రాణ స్నేహితురాలు ఎనిడ్ ( ఎమ్మా మైయర్స్ ) ప్రమాదంలో ఉందని, వెడ్నెస్‌ డే ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తోంది అని చూపించారు మేకర్స్. వెడ్నెస్‌ డే ముఖంలో నల్లటి కన్నీళ్లు ప్రవహించిన తరువాత ఆమె తల్లి ఏం చూశావని అడిగితే “ఎనిడ్ చనిపోయింది. ఇదంతా నా తప్పు” అని వెడ్నెస్‌డే సీజన్ 2 , పార్ట్ వన్ ట్రైలర్ లో స్పష్టంగా చెప్పడం కన్పిస్తోంది. అంతేకాదు “నాకు ఎంత త్వరగా సమాధానాలు లభిస్తాయో, అంత త్వరగా నేను ఎనిడ్‌ను రక్షించగలను. లేదా ప్రయత్నిస్తూ చనిపోతాను” అని వెడ్నెస్‌ డే చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రెండు పార్ట్స్ గా… రిలీజ్ డేట్స్
నిజానికి సీజన్ 2 ట్రైలర్ ను ఏప్రిల్ 23నే రిలీజ్ చేశారు. కానీ మరోసారి రెండవ ట్రైలర్ ను రిలీజ్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఇందులో స్టీవ్ బుస్సేమి, జోవానా లంలీ, బిల్లీ పైపర్, లేడీ గాగా వంటి కొత్త తారాగణం నటిస్తుండడం క్యూరియాసిటీని పెంచేస్తోంది. ట్రైలర్ లోనే విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో సిరీస్ రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ 2 మొదటి భాగం ఆగస్టు 6న, రెండవ భాగం సెప్టెంబర్ 3న విడుదలవుతుంది.


 

Related News

OTT Movie : పెళ్ళాలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… ఇంత ఓపెన్ గా అలాంటి సీన్లేంది భయ్యా ?

OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!

OTT Movie : గ్యాంగ్స్టర్ తో సీక్రెట్ డీల్… రివేంజ్ కోసం ఇంతకు దిగజారాలా ? ట్విస్టులే ట్విస్టులున్న పంజాబీ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie: అసలే అజంతా గుహలు.. పక్కనే అందమైన అమ్మాయి, రొమాన్స్ ప్రియులకు పండగలాంటి సినిమా ఇది

OTT Movie : చేతబడి చేసి చావుకు దగ్గరయ్యే అమ్మాయి… మాస్క్ చుట్టే మిస్టరీ అంతా… 7 రోజుల్లో ఆ పని చేయకపోతే ఫ్యామిలీ ఫసక్

OTT Movie : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా

Big Stories

×