OTT Movie : హారర్ సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి సినిమాలంటే చెవి కోసుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ సినిమా రాజా ఫెస్టివల్ సమయంలో విడుదలై, ఒడియా ప్రేక్షకులలో భారీ ఆదరణ పొందింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘బౌ బుట్టు భూత’ (Bou Buttu Bhuta). 2025లో రిలీజ్ అయిన ఈ మూవీ జగదీష్ మిశ్రా దర్శకత్వంలో తీసిన ఒడియా కామెడీ-హారర్-డ్రామా. బాబుషాన్ మొహంతి (బుట్టు), అపరాజితా మొహంతి (తల్లి), ఆర్చితా సాహు, అనుగులియా బంటీ, కృష్ణ కర్, ఉదిత్ గురు, రాబిన్ దాస్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. 128 నిమిషాల రన్‌టైమ్‌తో, హారర్ ఎలిమెంట్స్, సీరియస్ థీమ్స్ కారణంగా UA16+ రేటింగ్‌తో 2025 జూన్ 12న రాజా ఫెస్టివల్ సమయంలో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో ఒడియా భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ఇండియాలో 12.61 కోట్లు, వరల్డ్‌వైడ్ 14.5 కోట్లు సాధించి, ఒడియా సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది.
కథలోకి వెళ్తే…
కథ ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ బుట్టు (బాబుషాన్ మొహంతి), అతని తల్లి (అపరాజితా మొహంతి) సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. బుట్టు తన గ్రామ జీవితాన్ని వదిలి, పట్టణంలో మెరుగైన జీవితం కోసం కలలు కంటాడు. కానీ అతని తల్లికి గ్రామాన్ని వదిలి వెళ్ళడం నచ్చదు. బుట్టు తన స్నేహితులు, ముఖ్యంగా ఆర్చితా సాహు పోషించిన పాత్రతో విలేజ్ లైఫ్ ను ఆస్వాదిస్తాడు. నీ అతను ఎప్పుడూ బయటి ప్రపంచం గురించే ఆలోచిస్తాడు.
Read Also : అర్దరాత్రి డోర్ వెనకుండి దాగుడు మూతలాడే దెయ్యం… ఈ హర్రర్ మూవీని చూశాక నిద్ర పట్టడం కష్టమే
ఒక రోజు ఊహించని విధంగా ఒక అతీంద్రియ శక్తి గ్రామంలో కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటన బుట్టు, అతని తల్లి జీవితాన్ని మారుస్తుంది. ఈ సంఘటనలు ఒడియా సంస్కృతిలో తరచూ తాతలు, అమ్మమ్మలు చెప్పే “ఆయి మా కహానీ” (తల్లి కథలు) లాంటి కథలను గుర్తు చేస్తాయి. ఈ భూత రూపం, గ్రామస్తులలో భయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తూ, బుట్టుతో పాటు అతని స్నేహితులను ఒక రోమాలు నిక్కబొడుచుకునే సాహసంలోకి నడిపిస్తుంది. ఈ సాహసంలో, బుట్టు తన కలలను సాధించడానికి, తన తల్లితో ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, క్లైమాక్స్‌లోఒక ట్విస్ట్ ద్వారా ఈ భూత రహస్యం వెల్లడవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? హీరో తల్లిని పట్టి పీడిస్తున్న ఆ దెయ్యం ఎవరు? ఇంతకీ చివరికి బిట్టు కల నెరవేరిందా లేదా? అనే అంశాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఒడియా సంప్రదాయాలు, విలేజ్ లైఫ్ స్టైల్, అతీంద్రియ కథలను మిళితం చేస్తూ, ఒక స్పైన్-చిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఒడియా సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పాలి.