E-Paper
Advertisement

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త కంటెంట్… 2 సినిమాలు, 2 సిరీసులు తెలుగులోనే

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త కంటెంట్… 2 సినిమాలు, 2 సిరీసులు తెలుగులోనే
Advertisement

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో ఏ కొత్త సినిమా చూడాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారా ? అయితే ఓటీటీలో ఇప్పటికే వచ్చిన కొన్ని కొత్త సినిమాలు, సిరీస్ లు బెస్ట్ ఆప్షన్. లవ్ స్టోరీ, క్రేజీ కామెడీ, స్పై థ్రిల్లర్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా… ఇలా నాలుగు వేర్వేరు రకాల కంటెంట్ ఈ వారం ఓటీటీల్లో కొత్త కొత్త మూవీస్ రెడీగా ఉన్నాయి. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5లో అందుబాటులో ఉన్న ఆ నాలుగు సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. కొత్త మలుపు (Kotha Malupu)

హైదరాబాద్‌లో జులాయిగా తిరిగే కమల్ ఒక పెళ్లి కోసం కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఓరోజు రాత్రి కమల్ ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో చీకట్లో ముఖం కనిపించకుండా ఓ యువతి అతడిని కాపాడుతుంది. ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకోవడానికి కమల్ మొదలు పెట్టే అన్వేషణ, ఆ అమ్మాయి, ఆమె గతానికి సంబంధించిన షాకింగ్ నిజం ఏంటి ? అన్నది కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

2. ఎకసెకలు (Ekasekalu Mini Series)

Advertisement

సంధ్యా రాజు దర్శకత్వంలో పృథ్వీరాజ్, రోహిణి, లక్ష్మణ్ టేకుముడి ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ మినీ సిరీస్ ‘ఎకసెకలు’. సినిమా తీయాలని కలలు కనే ముగ్గురు వ్యక్తుల చుట్టూ, ఆ సినిమా తెర వెనుక జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. సినిమా షూటింగ్‌లో అస్సలు జరగకూడని పొరపాట్లన్నీ జరిగి ఎలాంటి గందరగోళం నెలకొంటుంది? ఎలాంటి నవ్వులు పూయించే సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయనేది ఈ సినిమాలో చూడవచ్చు. ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ Win Minis అనే వీక్లీ సిరీస్ లో భాగంగా వచ్చింది.

3. ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (Mukhbir – Telugu Dubbed Movie)

ఈ లిస్ట్ లో ఉన్న మిగతా సినిమాలు, సిరీస్ లు తెలుగువే. కానీ ఇది మాత్రం తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి వచ్చిన హిందీ మూవీ. ప్రకాష్ రాజ్, జైన్ ఖాన్ దురానీ, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన హై-వోల్టేజ్ హిస్టారికల్ స్పై థ్రిల్లర్. భారత్-చైనా యుద్ధం ముగిసిన తర్వాత 1965 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో కథ జరుగుతుంది. భారతదేశంపై పాకిస్తాన్ రక్షణ దళాలు దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని భారత నిఘా వర్గాలకు సమాచారం అందుతుంది. దీన్ని అడ్డుకోవడానికి అత్యంత కఠినమైన శిక్షణ పొందిన ఒక భారతీయ సీక్రెట్ ఏజెంట్ తన ప్రాణాలను పణంగా పెట్టి, ఒక నకిలీ గుర్తింపుతో పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ పాక్ మిలిటరీ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని, శత్రుదేశం యొక్క రహస్య వ్యూహాలను అల్టిమేట్ టైమింగ్‌లో భారత్‌కు చేరవేసి యుద్ధాన్ని ఎలా ఆపాడు అనేదే ఈ ఉత్కంఠభరితమైన మూవీ కథ. ZEE5లో ఈ మూవీని తెలుగులో చూడవచ్చు.

4. శ్రీమతి శ్రీవారు వీక్లీ సిరీస్ (Srimathi Srivaru Series)

Advertisement

సుమన్, ప్రగతి, జాను వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా. మధ్యవయస్కులైన దంపతులు తమ పిల్లలను పెంచి పెద్ద చేసి, లైఫ్‌లో వారికి సంబంధించిన అన్ని బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన జీవితాన్ని ఒకరికొకరు తోడుగా, ప్రశాంతంగా గడపాలని ఆశిస్తారు. అయితే ఆ తరువాత ఏమైంది అన్నదే స్టోరీ. ETV Winలో Katha Sudhaలో భాగంగా తెరకెక్కింది. లవ్ స్టోరీ కావాలంటే ప్రైమ్‌లో ‘కొత్త మలుపు’, కామెడీ కావాలంటే ఈటీవీ విన్‌లో ‘ఎకసెకలు’, దేశభక్తి థ్రిల్లర్ కావాలంటే జీ5లో ‘ముఖ్బీర్’, లేదా ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలంటే ఈటీవీ విన్‌లో ‘శ్రీమతి శ్రీవారు’ చూడవచ్చు.

Read Also: పాడుబడిన పాత గుడిలో పని… రివేంజ్ తో గడగడలాడిస్తున్న కన్నడ అడ్వెంచర్ ఫ్యాంటసీ

Tags

Related News

అయ్యబాబోయ్ ఇదేం అరాచకం… చీమల్లా దూరి చికాకు పెట్టే చిట్టి మనుషులు

17 మందిని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి మావా ?

జంతువులను చంపే వింత కిల్లర్… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

మరో యువకుడితో సన్నిహితంగా ప్రేమించిన అమ్మాయి… అచ్చమైన కోనసీమ ప్రేమకథ

40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

బ్రేకప్ అయిన వాళ్ళంతా రెండో ఛాన్స్ కోసం… రమ్యకృష్ణ క్రేజీ రియాలిటీ షో… అన్నీ అలాంటి షోలే

Big Stories

Advertisement
×