E-Paper
Advertisement

పాడుబడిన పాత గుడిలో పని… రివేంజ్ తో గడగడలాడిస్తున్న కన్నడ అడ్వెంచర్ ఫ్యాంటసీ

పాడుబడిన పాత గుడిలో పని… రివేంజ్ తో గడగడలాడిస్తున్న కన్నడ అడ్వెంచర్ ఫ్యాంటసీ
Advertisement

Mythological Thriller : శాపాలు , మునులు, ఋషులు… ఇలాంటి అంశాలన్నీ మనం పురాణాలలో చదువుకుంటూ ఉంటాము. అంతేగానీ అలాంటివి అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయ్ ? కానీ పురాణాల నుంచి కలియుగంలోకి ఓ శాపం అడుగు పెడితే… ఆ శాపాన్ని తొలగించడానికి ఓ అనాథ ఆదిశక్తి రూపం దాలిస్తే… ఎలా ఉంటుందో చూడాలని ఉందా ? అయితే ‘శిఖండి’ (Shikhandi) మూవీ మీ కోసమే. 2026లో విడుదలైన ఈ కన్నడ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ అనాథ యువకుడి చుట్టూ నడుస్తుంది. సమాజం అతన్ని ఎందుకూ పనికిరాని వ్యక్తిగా చూస్తుంది. కానీ అలాంటి వ్యక్తి ఒక క్రూరమైన, వినాశకరమైన శక్తులున్న విలన్ ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఈ పోరాటంలో అతనికి తెలియకుండానే అతనిలో కొన్ని అదృశ్య, రహస్యమైన శక్తులు మేల్కొంటాయి. ఆ శక్తులు అతన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ పోరాటం కేవలం వర్తమానానికి సంబంధించినది మాత్రమే కాదు. దీని వెనుక మహాభారతంలోని ప్రసిద్ధ పాత్ర అయిన ‘శిఖండి’ పురాణ గాథ దాగి ఉంటుంది.

Advertisement

గత జన్మలోని పగ, శాపం, ప్రతికారం కలియుగంలో ఎలా పునరావృతం అయ్యాయి ? అసలు ‘శిఖండి’ శక్తులకు ఈ అనాథ యువకుడికి ఉన్న సంబంధం ఏంటి ? అన్నదే ఈ చిత్రంలోని అసలైన ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్. కథలో ఇసుక మాఫియా రాజకీయాలు, జోగిని సంప్రదాయాలు, ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్స్ నమ్మకాలు, ఏడు ఆత్మల మిస్టరీ వంటి సబ్‌ప్లాట్లు సినిమాను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. మరి ఇంతకీ ఆ అనాథ బాలుడిలో దాగి ఉన్న శక్తి ఏంటి ? ఆ విలన్ ఎవరు ? విలన్ ను మన హీరో ఎలా ఓడించాడు ? సినిమాలో ఉన్న శాపం, శిఖండికి ఉన్న లింకు ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.

ఎక్కడ చూడవచ్చు ?

అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘శిఖండి’. గురుమూర్తి వి. దర్శకత్వంలో యువరాజ్ గౌడ, నిఖిల్ మలియక్కల్, రాజ్ దీపక్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో పురాణాలను, ప్రస్తుత కలియుగ సామాజిక పరిస్థితులను ముడిపెడుతూ సాగే వినూత్న మైథలాజికల్ ఫాంటసీ పారానార్మల్ థ్రిల్లర్ గా రూపొందింది. యువరాజ్ గౌడ అనాథ యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. రాజ్ దీపక్ శెట్టి విలన్ పాత్రలో మెప్పిస్తాడు. నిఖిల్ మలియక్కల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ లో పూర్ణచంద్ర పాత్రలో మెరిసాడు. సినిమా ఫాంటసీ థ్రిల్లర్ మాత్రమే కాదు, పురాణాలు, సమాజపు సమస్యలను అద్భుతంగా మిళితం చేసిన ఒక ఎపిక్ అడ్వెంచర్. ఈ చిత్రం చూస్తుంటే మహాభారతం నుంచి మనం ఇప్పటికీ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అర్థమవుతుంది. ‘శిఖండి’ మూవీ ఓటీటీలో తెలుగు వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Amazon Prime Videoలో వీక్షించవచ్చు.

Advertisement

Read Also: ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×