E-Paper
Advertisement

రూ.799కే క్రిస్టల్ క్లియర్ ఆడియో.. అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న GOBOULT K10!

రూ.799కే క్రిస్టల్ క్లియర్ ఆడియో.. అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న GOBOULT K10!
Advertisement

Boult K10 earbuds: ఈ రోజుల్లో జేబులో ఒక్క వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయినా లేకపోతే అసలు ట్రెండే కాదండోయ్! అయితే.. బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ కొనాలంటే.. వేలకు వేలు ఖర్చు పెట్టాలి అనుకుంటే పొరపాటే. ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బౌల్ట్’ ఇండియాలో.. సరికొత్త ‘Boult K10’ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను చాలా తక్కువ ధరకే తీసుకొచ్చింది. కేవలం రూ.799 బడ్జెట్ ధరలోనే లభిస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏమేం క్రేజీ ఫీచర్స్ ఉన్నాయో, ఇది మనకు ఎంతవరకు బెస్ట్ ఛాయిస్ అనేది ఇప్పుడు చూద్దాం.

Boult K10 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ :

ఈ కాలం యూత్‌కి పాటలు వినాలన్నా.. గేమింగ్ ఆడాలన్నా లేదా ఆఫీస్ కాల్స్ మాట్లాడాలన్నా మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ చాలా అవసరం. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అదే సమయంలో లుక్ కూడా అదిరిపోవాలి. సరిగ్గా ఇలాంటి వారి కోసమే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ బౌల్ట్ సరి కొత్త Boult K10 ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి దించింది. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్స్ మరియు ఆఫర్లలో కేవలం రూ.799 లకే అందుబాటులో ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో ఈ రేంజ్ ఫీచర్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

Advertisement

ప్రీమియం లుక్:

మొదటి చూపులోనే ఈ ఇయర్‌బడ్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. కేస్ చాలా కాంపాక్ట్‌గా, జేబులో సులభంగా ఇమిడిపోయేలా “పాకెటబుల్ డిజైన్” తో వస్తుంది. ఇయర్‌ బడ్స్ ప్యూర్ బ్లాక్ మరియు బ్లూ ఐస్ వంటి ట్రెండీ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. చెవుల్లో.. పెట్టుకున్నప్పుడు చాలా లైట్‌వెయిట్‌గా అనిపిస్తాయి. ఎక్కువ సమయం వాడుతున్నా ఎలాంటి అసౌకర్యం ఉండదు.

Advertisement

50 గంటల ప్లేబ్యాక్:

ఈ ఇయర్‌బడ్స్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. సింగిల్ ఛార్జ్‌తో ఈ కేస్ ఏకంగా 50 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. అంటే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు బ్యాటరీ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. దీనితో పాటు టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 120 నిమిషాల (2 గంటల) పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.

ఫర్ఫెక్ట్ బేస్ :

పాటల్లో మంచి బేస్ ఉంటేనే.. ఆ కిక్కే వేరు. బౌల్ట్ K10 లో 10mm లేదా కొన్ని వేరియంట్లలో వస్తున్న 13mm డ్రైవర్లు, బౌల్ట్ సిగ్నేచర్ BoomX టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల హై-ఫిడిలిటీ అకౌస్టిక్స్, డీప్ బాస్ అందుతుంది. మీరు మెలోడీ సాంగ్స్ విన్నా, థంపింగ్ మాస్ సాంగ్స్ విన్నా ప్రతి సౌండ్ క్రిస్టల్ క్లియర్‌గా వినబడుతుంది.

గేమర్స్ కోసం ‘కాంబ్యాట్ మోడ్’:

మీరు ఫ్రీఫైర్, బీజీఎమ్‌ఐ లాంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటారా? అయితే.. ఈ ఇయర్‌బడ్స్ మీకు బాగా నచ్చుతాయి. ఇందులో.. ఇచ్చిన ప్రత్యేకమైన కాంబ్యాట్ మోడ్ ఆన్ చేస్తే 45ms అల్ట్రా-లో లేటెన్సీ లభిస్తుంది. అంటే గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ పైన వచ్చే విజువల్స్‌కి, మీకు వినపడే సౌండ్‌కి అస్సలు గ్యాప్ ఉండదు. ఎనిమీస్ అడుగుజాడలను ఈజీగా పసిగట్టేయొచ్చు.

క్రిస్టల్ క్లియర్ కాల్స్:

మార్కెట్లో చాలా బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో కాలింగ్ క్వాలిటీ అస్సలు బాగోదు. కానీ బౌల్ట్ ఇందులో.. Zen Quad Mic ENC (Environmental Noise Cancellation)ఫీచర్‌ను ఇచ్చింది. దీని వల్ల మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వచ్చే రోడ్ నాయిస్‌ను ఇది చాలా వరకు తగ్గిస్తుంది. అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

ఇతర క్రేజీ ఫీచర్స్:
బ్లూటూత్ v5.4: లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్ పక్క గదిలో.. ఉన్నా కనెక్షన్ అస్సలు కట్ అవ్వదు. సులభంగా పేర్ అవుతుంది.

IPX5 వాటర్ రెసిస్టెన్స్: దీనికి ఐపీఎక్స్5 రేటింగ్ ఉంది. కాబట్టి జిమ్‌లో.. వర్కౌట్స్ చేసేటప్పుడు స్వెట్ (చెమట) పట్టినా లేదా లైట్ గా వర్షం చినుకులు పడినా ఇయర్‌బడ్స్ అస్సలు పాడవువు.

టచ్ కంట్రోల్స్ & వాయిస్ అసిస్టెంట్: జస్ట్ ఇయర్‌బడ్స్ పైన ట్యాప్ చేసి సాంగ్స్ మార్చవచ్చు. కాల్స్ లిఫ్ట్ చేయవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×