Driverless Metro Train: భారతీయ రైల్వే వ్యవస్థ రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే వందే భారత్(Vande Bharat), నమో భారత్(Namo Bharat) లాంటి అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఢిల్లీలో డ్రైవర్ లెస్ రైళ్లు(Driverless Train) ట్రాక్ ఎక్కగా, త్వరలో బెంగళూరులోనూ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ డ్రైవర్ లెస్ రైళ్లను (Made-in-India Driverless Train)ఇండియాలోనే తయారు చేయడం విశేషం.
తొలి మేడ్ ఇన్ ఇండియా డ్రైవర్ లెస్ మెట్రో రైలు
బెంగళూరులో అందుబాటులోకి రాబోతున్న డైవర్ లెస్ మెట్రో రైళ్లు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందాయి. వీటిని టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (TRSL) నిర్మించింది. దేశంలోనే అత్యాధునిక కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) సిస్టమ్ తో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. తొలి మేడ్ ఇన్ ఇండియా డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లు నడిపించే ఘనత బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు దక్కనుంది. ఇప్పటికే తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బెంగళూరు కు చేరుకుందని BMRC వెల్లడించింది. ఈ రైలుకు సంబంధించిన కోచ్ లను దక్షిణ బెంగళూరు ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బ గోడి డిపోలో ఉంచారు.
🚆 First India-Made Train for Bengaluru’s Yellow Line Arrives! The new coaches are being coupled to form a full rake, followed by static & signaling tests. The train will also undergo anti-collision trials before operations begin. #BangaloreMetro #YellowLine #MakeInIndia pic.twitter.com/7YiyLxcJVo
— Infra Talks (@InfraTalksYT) February 10, 2025
బెంగళూరులో డ్రైవర్ లెస్ రైలు ఎక్కడ నడుస్తుందంటే?
ఇక బెంళూరులో డ్రైవర్ లెస్ రైలు నడవాల్సిన రూట్ ను BMRCL అధికారులు ఫిక్స్ చేశారు. ఎల్లో లైన్లో RV రోడ్ నుంచి సిల్క్ బోర్డ్ గుండా ఎలక్ట్రానిక్ సిటీ వరకు నడుస్తుందని వెల్లడించారు. ఈ రైలుతో పాటు కోచ్ లను కూడా టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (TRSL) నిర్మించిందని BMRCL వెల్లడించింది. భద్రతా ప్రయోజనాల దృష్ట్యా, రాబోయే కొద్ది రోజుల్లో చైనాలో తయారు చేయబడిన మోడల్ రైలుతో పాటు ఈ రైలును కూడా పరీక్షిస్తామని BMRCL తెలిపింది. మార్చి మొదటి వారంలో డ్రైవర్ లెస్ ట్రైన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపింది. పరీక్షలు పూర్తయిన తర్వాత కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (CMRS)ని చెకింగ్ కోసం పిలుస్తామని తెలిపింది. RV రోడ్‌ను బొమ్మసంద్రకు అనుసంధానించే 19.15-కి.మీ ఎల్లో లైన్ చెకింగ్ ఉంటుందని వెల్లడించింది.
రూ. 1,578 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
భారత్ లో తయారు చేయబడిన రెండవ రైలు వచ్చే నెల చివరి నాటికి డెలివరీ చేయబడుతుందని BMRCL తెలిపింది. మిగిలిన డెలివరీలను 2025 చివరి నెలల్లో ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ నాటికి మరో రైలు డెలివరీ చేయబడుతుందని వెల్లడించింది. దీనితో పాటు, సెప్టెంబర్ నాటికి ప్రతి నెలా రెండు రైళ్ల ఉత్పత్తిని పెంచేలా టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (TRSL) ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక నమ్మ మెట్రోకు సంబంధించి ఎల్లో, పర్పుల్, గ్రీన్ లైన్ల కోసం TRSL 36 రైళ్లలో 34 నిర్మిస్తోంది. ఇందుకోసం BMRCL రూ. 1,578 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఢిల్లీలో సేవలు అందిస్తున్న తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు
2020లో దేశంలోనే తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలును ప్రధాని మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్లను కలుపుతూ 38 కిలో మీటర్ల పరిధిలో ఈ రైలును నడుపుతున్నది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా డ్రైవర్ లెస్ రైళ్ల పట్ల మక్కువ పెరిగింది. మరికొద్ది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 18 నగరాలకు డ్రైవర్ లెస్ మెట్రో రైలు సేవలు విస్తరించే అవకాశం కనిపిస్తున్నది.
Read Also: మెట్రో ప్రయాణీకులకు షాక్, టికెట్ ధరలు ఏకంగా 50% పెంపు!