BigTV English

Action Thriller OTT: ఓటీటీలోకి యాక్షన్ తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Action Thriller OTT: ఓటీటీలోకి యాక్షన్ తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Action Thriller OTT: థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ సినిమాలు అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్న కూడా నెలలోపే ఓటీటిలోకి దర్శనం ఇస్తుంటాయి. బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాలు అయితే కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతాయి. కానీ యావరేజ్ టాక్ ను అందుకున్న సినిమాలు అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక ఓటీటీ లోకి సినిమాలు భారీ వ్యూస్ ను అందుకుంటున్నాయి.. ఈ మధ్య ఎన్నో సినిమాలు ఓటీటీలోనే సక్సెస్ అవుతున్నాయి. ఇక మేకర్స్ కొందరు అయితే సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో నటించిన మూవీ ఒకటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఆ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో చూడొచ్చునో ఒకసారి తెలుసుకుందాం..


ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలు వరుసగా ఒకొక్కటి ఓటీటీలో సడెన్ ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా అల్లరి నరేష్ నటించిన యాక్షన్ మూవీ బచ్చల మల్లి.. యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించాడు. హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ కాస్త బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాంతో మూవీ వచ్చిన కొన్ని రోజులకే దూరం అయ్యింది. ఇక ఇప్పుడేమో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.. జనవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. తొందరలోనే బచ్చలమల్లి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. అల్లరి నరేష్ గతంలో నాంది మూవీతో వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. అదే జోరులో ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పెద్దగా అలరించలేక పోయింది. ఈ మూవీలో మూర్ఖత్వంతో చేసిన తప్పుల కారణంగా ఓ యువకుడి జీవితం ఎలా నాశనం అయ్యిందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సుబ్బు మంగదేవి బచ్చలమల్లి కథను రాసుకున్నాడు.. బచ్చలమల్లి చదువులో ముందుంటాడు. తండ్రి మాటను ధాటని బిడ్డగా ఉంటాడు. అనుకోకుండా తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా చదువుకు దూరమవుతాడు. తాగుడుకు బానిసగా మారుతాడు. రోజు గొడవలు పడుతుంటాడు.. మంచివాడుగా ఉన్న మల్లి ఎందుకు ఇలా మారతారు అన్నది స్టోరీ.. థియేటర్లలో సరిగ్గా ఆకట్టుకోలేని ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి… అల్లరి నరేష్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో హిట్ కొడుతున్నాడు. ఈ మూవీ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మిక్స్డ్ టాక్ ను మాత్రమే అందుకుంది. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారు.


Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×