E-Paper
Advertisement

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్
Advertisement

Humanoid Robot: టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం నమోదైంది. అత్యంత ఫాస్టెస్ట్ మ్యాన్ గా పేరుగాంచిన జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డును ఓ రోబోట్ బద్దలు కొట్టింది. చైనాకు చెందిన ఒక ప్రముఖ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన హ్యూమనోయిడ్ రోబోట్.. పరుగులో బోల్ట్ రికార్డును చేరిపేసిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రోబోట్ రయ్ రయ్..

చైనాకు చెందిన రోబోటిక్ కంపెనీ యూనిట్రీ ‘సూపర్ హ్యూమన్’ పేరుతో సరికొత్త హ్యుమనాయిడ్ రోబోట్ ను ఆవిష్కరించింది. ఇది సెకనుకు 12.66 మీటర్ల గరిష్ట వేగంతో పరిగెత్తగలదని కంపెనీ తెలియజేసింది. ఈ రోబోట్ ను కేవలం 3 నెలల్లోనే అభివృద్ధి చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ట్రాక్ పై ఇది అత్యంత వేగంగా పరిగెడుతున్న దృశ్యాలను సైతం సదరు రోబోటిక్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

ఉసేన్ బోల్ట్ రికార్డుతో పోలిక

2009 బెర్లిన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల రేసును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అప్పుడు బోల్డ్ సెకనకు 12.42 మీటర్ల వేగంతో పరిగెత్తడం గమనార్హం. ఇప్పుడు చైనా రోబోట్ ట్రాక్‌పై సెకనుకు 12.66 మీటర్ల వేగం (గంటకు 45.6 కి.మీ స్పీడ్)తో దూసుకెళ్లింది. ఈ లెక్కన చూస్తే ఇదే వేగంతో 100 మీ. బోల్ట్ రికార్డును ఇది ఈజీగానే బద్దలు గొడుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సూపర్ హ్యూమన్ రోబోట్ ఒకేచోట నిలబడి ఏకంగా 2 మీటర్ల ఎత్తువరకూ జంప్ చేసి ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి మానవులకు సాధ్యంకానీ పనులను చేసే దిశగా రోబోటిక్స్ టెక్నాలజీ ఎదుగుతుందోని అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: అమ్మాయి కోసం రచ్చరచ్చ… అసలు టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్… ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా

నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..

రోబోట్ పరుగు వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ లేదా అథ్లెటిక్స్ విభాగంలో రోబోట్లకు ప్రత్యేక పోటీలు పెట్టాలేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోట్ల అభివృద్ధి చూస్తుంటే భయం వేస్తోందని మరికొందరు అభిప్రాయపడ్డారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే సీన్స్.. ఇప్పుడు కళ్లముందు నిజమవుతున్నాయని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. మెుత్తం మీద ఈ సూపర్ హ్యూమన్ రోబో.. తన వేగంతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు.

Also Read: అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×