E-Paper
Advertisement

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు
Advertisement

Fantasy Comedy on OTT: పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా మనుషులుగా మారితే ఎలా ఉంటుంది ? పైగా ఆ పాత్రలకు ఈ ప్రపంచంలో ఎలా బతకాలో కూడా తెలియకపోతే ? అలాంటి వింత కాన్సెప్ట్‌తో ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్‌ను కలిపి తెరకెక్కించిన సినిమా ‘రాహు కేతు’ (Rahu Ketu). వరుణ్ శర్మ, పుల్కిత్ సామ్రాట్ కలిసి నటించిన ఈ సినిమాలో ఇద్దరూ మ్యాజికల్ బుక్ నుంచి బయటకొచ్చిన పాత్రలుగా కనిపిస్తారు. అమాయకత్వం, అల్లరి, బ్యాడ్ లక్‌తో తిరిగే ఈ ఇద్దరి జీవితాల్లోకి ఓ తెలివైన అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో అసలు గందరగోళం మొదలవుతుంది. ఒక మాయా పుస్తకం కోసం మొదలైన వేట… చివరికి డ్రగ్ మాఫియా వరకు ఎలా వెళ్లింది? ఈ ఇద్దరు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

చూరు లాల్ శర్మ అనే రచయిత దగ్గర ఓ విచిత్రమైన మ్యాజికల్ నోట్‌బుక్ ఉంటుంది. అందులో అతను ఏం రాసినా అది నిజ జీవితంలోకి వచ్చేస్తుంది. సమాజంలో జరుగుతున్న అవినీతి, చెడును అంతం చేయాలనే ఉద్దేశంతో చూరు లాల్ తన పుస్తకంలో రాహు, కేతు అనే ఇద్దరు పాత్రలను సృష్టిస్తాడు. పుస్తకం మాయతో రాహు, కేతు నిజమైన మనుషులుగా మారి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. కానీ వారికి ఈ కొత్త ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అమాయకంగా ప్రవర్తిస్తూ, తమకు తెలియని విషయాల్లో తలదూరుస్తూ ఇద్దరూ చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి.

Advertisement

ఇంతలో వారి దగ్గరున్న మ్యాజికల్ బుక్‌పై మీను టాక్సీ కన్ను పడుతుంది. ఆ పుస్తకానికి ఉన్న శక్తిని తెలుసుకున్న ఆమె దాన్ని దొంగిలిస్తుంది. అంతటితో ఆగకుండా, పుస్తకం ద్వారా రాహు, కేతులను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుంది. తమను సృష్టించిన పుస్తకం తమ చేతుల్లో లేకపోవడంతో రాహు, కేతు దాన్ని తిరిగి సంపాదించడానికి మీను వెంటపడతారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఊహించని సమస్య ఎదురవుతుంది. వాళ్లు ఏకంగా ఓ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ మధ్యలో చిక్కుకుంటారు.

ఒకవైపు మాయా పుస్తకం కోసం మీను టాక్సీతో పోరాటం… మరోవైపు ప్రమాదకరమైన మాఫియా గ్యాంగ్. ఈ రెండింటి మధ్యలో రాహు, కేతు పడే తిప్పలు కథను మరింత కామెడీగా మార్చేస్తాయి. ముఖ్యంగా వరుణ్ శర్మ, పుల్కిత్ సామ్రాట్ మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. చివరికి రాహు, కేతు మ్యాజికల్ బుక్‌ను తిరిగి దక్కించుకున్నారా? మీను టాక్సీ ప్లాన్ ఏమైంది? డ్రగ్ మాఫియా నుంచి ఈ ఇద్దరు ఎలా బయటపడ్డారు? పుస్తకంలో రాసిన పాత్రలుగా మొదలైన వీళ్లు నిజంగా సమాజానికి ఎలా ఉపయోగపడ్డారు? అనేదే క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

తెలుగులో ఉందా లేదా ?

Advertisement

‘రాహు కేతు’ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో లేదు. ఈ సినిమా ప్రస్తుతం ఒరిజినల్ హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంటసీ, కామెడీతో పాటు వరుణ్ శర్మ–పుల్కిత్ సామ్రాట్ కాంబినేషన్‌లో వచ్చే ఎంటర్‌టైనింగ్ సీన్స్ చూడాలనుకునేవారికి ‘రాహు కేతు’ ఓ సరదా టైమ్‌పాస్ మూవీ. ముఖ్యంగా మ్యాజికల్ బుక్ అనే కాన్సెప్ట్ ఉండడంతో సినిమా ఇంట్రెస్టింగా సాగుతూనే నవ్వులు పూయిస్తుంది.

Read Also: 17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×