E-Paper
Advertisement

అగ్నిపరీక్ష కాదు.. అభిజిత్, నవదీప్ ల స్వయంవరం.. మండిపడ్డ కామన్ మ్యాన్!

అగ్నిపరీక్ష కాదు.. అభిజిత్, నవదీప్ ల స్వయంవరం.. మండిపడ్డ కామన్ మ్యాన్!
Advertisement

Agni Pariksha 2: బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు సంబంధించి నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్ షో తీవ్ర విమర్శలపాలవుతోంది. సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లో అవకాశం కల్పిస్తామంటూ నిర్వహిస్తున్న ఈ షోలో జడ్జీలుగా ఉన్న నవదీప్ (Navdeep), అభిజిత్(Abhijeeth), బిందు మాధవి(Bindhu madhavi) లు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్లపై హేళనకర వ్యాఖ్యలు చేయడం, వివక్ష చూపించడంపై ఒక సామాన్యుడు మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇది అగ్నిపరీక్ష కాదు.. స్వయంవరంలా ఉంది:

ఈ షో తీరుపై ఓ సామాన్యుడు స్పందిస్తూ.. “ఇది కంటెస్టెంట్లకు అగ్నిపరీక్షలా లేదు, నవదీప్, అభిజిత్‌లకు స్వయంవరం వేదికలా ఉంది” అని ఘాటుగా విమర్శించారు. అబ్బాయిలు రాగానే కనీసం వారి టాలెంట్ చూడకుండానే సెకన్లలో ‘రెడ్ కార్డ్’ ఇచ్చి బయటకు పంపించేస్తున్నారని, అదే అమ్మాయిలు వస్తే మాత్రం ప్రేమగా మాట్లాడుతూ, హగ్గులు ఇస్తూ ‘గ్రీన్ కార్డ్’ ఇస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉప్పల్ బాలుపై అవమానకర వ్యాఖ్యలు:

Advertisement

ట్రాన్స్‌జెండర్ ఉప్పల్ బాలును జడ్జీలు అవమానించి పంపించడంపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలాంటి వాళ్ల వల్ల సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుందంటూ నవదీప్ హేళనగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఇక అసలు జడ్జీలుగా ఉన్న వీళ్లు చేసిన సినిమాల వల్ల సమాజానికి ఏమైనా గొప్ప సందేశం వెళ్లిందా అని సదరు సాధారణ పౌరుడు ప్రశ్నించారు. వేదికపై ఉన్నామనే అధికారంతో నోటికి వచ్చింది మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

అభిజిత్‌కు జెన్యూన్ రోస్ట్.. నవదీప్ అసహనం:

షోలో ఓ కంటెస్టెంట్ జెన్యూన్‌గా మాట్లాడుతూ.. “బిగ్‌బాస్ గెలిచిన తర్వాత రెండేళ్లు అసలు ఎక్కడా కనపడలేదు” అని అభిజిత్‌ను రోస్ట్ చేస్తే, దాన్ని పర్సనల్‌గా తీసుకుని రెడ్ కార్డ్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే యూట్యూబర్ ‘రన్నింగ్ రాజా’ పట్ల శ్రీముఖి ప్రవర్తించిన తీరును కూడా తప్పుపట్టారు. టాస్క్‌లో భాగంగా గౌరవంగా ‘అక్క’ అని పిలిస్తే చెంప పగులుతుందని అనడం ఏంటని, ఒక ఛాన్స్ వల్లే మీరు ఈ పొజిషన్‌లో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

జెండర్ డిస్క్రిమినేషన్ పై అసహనం:

Advertisement

ఇక అబ్బాయిల విషయంలో ధనధన్ అని రెడ్ కార్డులు వేస్తూ, అమ్మాయిలకు మాత్రం గంటల తరబడి టైమ్ ఇస్తూ హగ్గులు ఇవ్వడం చూస్తుంటే వీళ్లకు బయట పెళ్లిళ్లు కాక ఈ షోలో సెట్ చేసుకుంటున్నారా అనే సందేహం వస్తోందని సదరు వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కంటెస్టెంట్ల టాలెంట్ చూడటానికి కనీసం సమయం కూడా ఇవ్వకుండా పంపించేసే హక్కు జడ్జీలకు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు.

also read: ఫోక్ డ్యాన్సర్ భార్యపై ఉప్పల్ బాలు ఫైర్!

సామాన్యుల భావోద్వేగాలతో ఆడుకుంటూ చెత్త షోలా మార్చేశారని, ఇప్పటికైనా జడ్జీలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని నెటిజన్లు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిభను ప్రోత్సహించాల్సిన వేదికపై ఇలాంటి వివక్ష, హేళనలు సరికాదని, నిర్వాహకులు దీనిపై తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×