OTT Thriller Movie : ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. ఇటీవల మూవీ లవర్స్ కోసం ఓటిటీ సంస్థలు వేరే భాషల్లోంచి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను తెలుగులోకి తీసుకొని వస్తున్నారు. అందుకే థ్రిల్లర్ మూవీల కోసం జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ స్టోరీలు అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి కాకుండా ఓటీటీలోకే డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుందేమో చూడాలి..
మూవీ & ఓటీటీ..
మనం ఇప్పుడు చెప్పుకొనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని రెండేళ్లు అయ్యింది. కానీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వారికి మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు. ఈ మూవీ పేరు వైఫ్ ఆఫ్.. ఇది నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతుంది. ఈ మూవీలో దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయినట్టు మేకింగ్ వీడియోనూ మూవీ టీమ్ రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది.. అయితే ఈ మూవీ రెండేళ్ల నుంచి థియేటర్లలోకి రావడానికి నోచుకోలేదు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వైఫ్ ఆఫ్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 23వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్‍ను నేడు రివీల్ చేసింది ఆ ప్లాట్‍ఫామ్.. ఈ మూవీ జనవరి 23 న ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం..
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీ మొత్తం ఒక స్టోరీ లైన్ తోనే రాబోతుంది. ఒక వైఫ్ గృహ హింస గురించి ఈ కథ ఉంటుంది. బావ రామ్‍ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అవని కష్టాల్లో పడుతుంది. రామ్ ఆమెను వేధిస్తుంటాడని ట్రైలర్లో ఉంది. తీవ్రమైన హింసను అవని ఎదుర్కొంటుంది. ఇలా వేదన భరిస్తూ ఓ దశలో ఎదురుతిరిగేందుకు నిర్ణయించుకుంటుంది.. ఇన్నాళ్ళ భర్త పెట్టే బాధలను తట్టుకొని ఎలా నీలబడుతుంది? ఇప్పటి వరకు బరితెగించిన భర్తను చూశాను. ఇక నుంచి భయపెట్టే భార్యను చూస్తాడు అని చెప్పే డైలాగ్ ఇందులో కనిపిస్తుంది.. అదిరిపోయే సన్నివేశల్లో మూవీని తెర కేక్కించారని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.ఈ సినిమాకు భాను యేరుబండి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దివ్యశ్రీ, అభినవ్ మణికంఠతో పాటు నిఖిల్ గాజుల, సాయి శ్వేత, వీర్ మనోహర్ కావలి, కిరణ్ పుతకల కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రాహుల్ తమద, సందీప్ రెడ్డి బొర్రా నిర్మాతలు వ్యవహారించారు. ప్రవీణ్ సంగీతాన్ని అందించారు..
WIFE OFF trailer out now..
This January 23rd get ready to board this Emotional and Thrilling ride..
‘Wife Off’ a journey you will hold close to your heart for a while.
Only on @etvwin@BhanuYerubandi_ @Gdivyaasree @abhinavactor06 @Nikhilgajula97 @MediaTamada@etvwin pic.twitter.com/MfihWqcstF— ETV Win (@etvwin) January 18, 2025