E-Paper
Advertisement

CM Chandrababu: డబ్బులు ఒక్కటే కాదు.. సంతానం కూడ ముఖ్యమే.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: డబ్బులు ఒక్కటే కాదు.. సంతానం కూడ ముఖ్యమే.. సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: డబ్బులు దండిగా వచ్చాయని, ఆనందకర జీవితం సాగుతుందన్న అభిప్రాయంతో పిల్లలు వద్దనుకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలుంటాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జ్యూరిక్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు సోమవారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు డబ్బులు సంపాదించడం పైనే దృష్టి కేంద్రీకరించి, తమ వారసత్వాన్ని కొనసాగించడంలో వెనుకంజ వేయొద్దన్నారు. పిల్లలు వద్దనుకుంటే, మీరు పోగు చేసిన ఆస్తి ఎవరు అనుభవిస్తారంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జపాన్ దేశం ఇటీవల ఇండియాకు మ్యాన్ పవర్ కావాలని అర్థించే స్థాయికి వచ్చిందని, అటువంటి పరిస్థితి మన ఇండియాకు రావద్దన్నారు.

Advertisement

ఎన్నికల సమయంలో ఎందరో విదేశాల నుండి వచ్చి తెలుగువారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. తాను జైలుకు వెళ్లిన సమయంలో విదేశాలలో కూడా తెలుగువారు నిరసనలు తెలిపి తమ అభిమానాన్ని చాటారని , వారందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. రాజకీయరంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చామని, యువతను రాజకీయంగా తాము ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పురోగతి నుండి తిరోగమనము వైపు సాగిందని, అందుకే ప్రజలు తమపై నమ్మకంతో భారీ మెజార్టీని అందించి అధికారాన్ని అప్పగించారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు తాను నాడు మైక్రోసాఫ్ట్ తీసుకురావడంతోనే, నేడు మన తెలుగు వారు సత్య నాదేళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నిర్వర్తిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. తెలుగు వారందరూ ఎక్కడున్నా, గ్లోబల్ లీడర్స్ కావాలని, అలాగే గ్లోబల్ సిటిజన్స్ గా గుర్తింపు పొందాలని చంద్రబాబు సూచించారు. మిమ్మల్ని ఏపీకి రమ్మని తాను ఆహ్వానించనని, స్వార్థంగా ఆలోచించే విధానం తనది కాదన్నారు సీఎం. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, తయారీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలోని యువత వద్ద నైపుణ్యత ఉందని, వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా విదేశాలలో ఉన్న తెలుగువారు సహకరించాలన్నారు.

Advertisement

Also Read: Nara Lokesh: అంతా భ్రాంతియేనా.. లోకేష్‌‌‌కు డిప్యూటీ సీఎం పదవి హుష్ కాకి..

వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన ప్రక్రియ పోలవరం నాశనం, రాజధాని శూన్యంలా పాలన సాగిందంటూ చంద్రబాబు విమర్శించారు. కర్మభూమిని జన్మభూమిని సరి సమానంగా చూడాలని, ఉక్రెయిన్ వార్ జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్న తెలుగువారి సహాయంతోటే వైద్య విద్యార్థులను దేశానికి రప్పించగలిగినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు పాల్గొన్నారు.

Related News

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×