OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. అందులోనూ సైకోలా మారి హత్యలు చేసే స్టోరీలు గుండె దడ పుట్టిస్తుంటాయి. ఇటువంటి సినిమాలు చూస్తున్నంతసేపు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. ఒక మనిషి నిర్లక్ష్యం కారణంగా జంతువుల రూపంలో ఉండే మనుషులు ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ మూవీ చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ బ్రిటిష్ స్లాషర్ హర్రర్ మూవీ పేరు ‘విన్నీ-ది-ఫూ: బ్లడ్ అండ్ హనీ’ (Winnie-the-Pooh: Blood and Honey). 2023 వచ్చిన ఈ మూవీకి రైస్ ఫ్రేక్-వాటర్‌ఫీల్డ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ A.A. మిల్నే, E.H. షెపర్డ్ రాసిన క్లాసిక్ ‘విన్నీ-ది-పూ’ పుస్తకాలకు ఒక హర్రర్ పారడీగా రూపొందించబడింది. ఈ హర్రర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ ఒక అడవిలో హండ్రెడ్ ఏకర్ వుడ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. చిన్నతనంలో క్రిస్టోఫర్ రాబిన్ అనే బాలుడు పిగ్లెట్, ఈయోర్, రాబిట్, ఔల్ వంటి ఆంత్రోపోమార్ఫిక్ జీవులతో స్నేహం చేస్తాడు. వాటితో సరదాగా గడుపుతుంటాడు. అయితే, క్రిస్టోఫర్ రాబిన్ కాలేజీకి వెళ్లడంతో వాటిని విడిచిపెడతాడు. అక్కడి నుంచి చదువుకోవడానికి సిటీ కి వెళ్ళిపోతాడు. అతను వారికి ఆహారం తెచ్చేవాడు కాబట్టి, అతను లేకపోవడంతో ఈ జీవులు ఆకలితో అల్లాడిపోతాయి. చలికాలం రావడంతో ఆహారం లేక, వారు తీవ్ర ఆకలితో బాధపడతారు. ఆకలికి తట్టుకోలేక వాటితో కలసి ఉన్న ఈయోర్‌ను చంపి తింటాయి. ఈ సంఘటన వారిని హింసాత్మకంగా మారుస్తుంది. మానవులపై పగతో నిండిన జీవులుగా మారుస్తుంది. సాధుజంతువులుగా ఉండే వీళ్ళు, క్రూర జంతువులుగా మారిపోతారు. తమ జంతు సహజ లక్షణాలకు తిరిగి వస్తారు.
కొన్ని సంవత్సరాల తర్వాత, క్రిస్టోఫర్ రాబిన్ తన చిన్ననాటి స్నేహితులను చూడటానికి, హండ్రెడ్ ఏకర్ వుడ్‌కు తిరిగి వస్తాడు. అతనితో పాటు అతని భార్య కూడా అక్కడికి వస్తుంది. కానీ అతను అక్కడ ఊహించని చాలా భయంకరమైన దృశ్యాలను చూస్తాడు. పూ, పిగ్లెట్ ఇప్పుడు క్రూరమైన హంతకులుగా మారిపోయి ఉంటారు. అదే సమయంలో, కొంతమది కాలేజీ అమ్మాయిలు విహారయాత్ర కోసం ఆ ప్రాంతంలోని వస్తారు. పూ. పిగ్లెట్, క్రిస్టోఫర్ రాబిన్‌పై పగతో ఆహారం కోసం వెతుకుతూ, ఒక రక్తపాత ఊచకోతను ప్రారంభిస్తారు. వారు క్రిస్టోఫర్‌ను బంధించి, అతని భార్యను చంపేస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలపై దాడి చేస్తారు. ఆ అమ్మాయిలను కూడా దారుణంగా చంపేస్తారు. ఈ మూవీ అంతటా వారు క్రూరంగా హత్యలు చేస్తూ, తమ బాధను, కోపాన్ని బయటపెడతారు. క్రిస్టోఫర్ రాబిన్ వాటి నుంచి తప్పించుకుని పారిపోతాడు. చివరికి క్రిస్టోఫర్ పై ఆ జంతువులు పగ తీర్చుకుంటాయా ? లేదా అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.