OTT Movie : ఫాంటసీ యాక్షన్ సినిమాలను చిన్నపిల్లలతో సహా ,పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చూస్తారు. ఇందులో ఉండే విజువల్స్ మూవీ లవర్స్ ను మరో లోకం లోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో దేవతలు, టైటాన్స్ మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఈ ఫాంటసీ మూవీ చివరివరకూ చూపు తిప్పు కూకుండా చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ పేరు ‘వ్రాత్ ఆఫ్ ది టైటాన్స్’ (Wrath of the Titans). 2012 లో వచ్చిన ఈ మూవీకి జోనాథన్ లైబెస్‌మాన్ దర్శకత్వం వహించాడు. ఇది 2010లో విడుదలైన ‘Clash of the Titans’ మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమా గ్రీకు పురాణాల నుండి ప్రేరణ పొందింది. దీని స్టోరీ పెర్సియస్ అనే హీరో చుట్టూ తిరుగుతుంది. అతనే ఈ స్టోరీని ఒక మలుపు తిప్పుతాడు. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
పెర్సియస్ తన తండ్రి జీయస్ నుండి చాలా శక్తులు పొందుతాడు. ‘Clash of the Titans’ సంఘటనల తర్వాత, పెర్సియస్ ఒక సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అతను మత్స్యకారుడిగా జీవనం సాగిస్తూ, తన కొడుకు హీలియస్‌తో కలసి ఒక గ్రామంలో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే దేవతలు, టైటాన్స్ మధ్య యుద్ధం మళ్లీ మొదలౌతుంది. దీనివల్ల పెర్సియస్‌కు ప్రశాంత మైన జీవితం దూరమవుతుంది. మరోవైపు ప్రపంచంలో దేవతల శక్తి కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవులు వారిని ఆరాధించడం మానుకుంటూ ఉంటారు. ఈ బలహీనతను ఉపయోగించుకుని, టైటాన్ లీడర్ క్రోనోస్, తన బందీఖానా నుండి విడుదల కావడానికి ప్రయత్నిస్తాడు. క్రోనోస్‌ను బంధించి ఉంచిన గోడలు కూడా బలహీనపడుతుంటాయి. అతడు బంధీ ఉండటానికి హేడిస్, ఏరిస్ పన్నిన కుట్రే కారణం.
హేడిస్, జీయస్‌కు ద్రోహం చేసి, క్రోనోస్‌కు సహాయం చేస్తాడు. ఈ క్రమంలో జీయస్ బందీ అవుతాడు.పెర్సియస్ తన తండ్రి జీయస్‌ను రక్షించడానికి, క్రోనోస్‌ను ఆపడానికి ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాడు. అతనికి ఈ ప్రయాణంలో ఆండ్రోమెడా అనే యోధురాలు ఎదురుపడుతుంది. వారు కలిసి టార్టరస్ అనే అండర్‌వరల్డ్‌కు వెళతారు. అక్కడ వారు భయంకరమైన రాక్షసులు, టైటాన్స్‌తో పోరాడాల్సి వస్తుంది.చివరికి పెర్సియస్ తన శక్తులను సమీకరించి, ఒక శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టిస్తాడు. ఈ ఆయుధంతో అతను క్రోనోస్‌ను ఓడించి, జీయస్‌ను రక్షిస్తాడు. ప్రపంచాన్ని వినాశనం నుండి కాపాడుతాడు. అయితే ఈ యుద్ధంలో జీయస్ మరణిస్తాడు, కానీ అతను పెర్సియస్‌కు తన వారసత్వాన్ని ఇస్తూ ధైర్యంగా జీవించమని చెబుతాడు.చివరికి పెర్సియస్ ప్రశాంతమైన గ్రామీణ జీవితాన్ని గడుపుతాడా ? లేక రాజ్య పాలన చేస్తాడా ? అనే విషయాలు తెలుసుకోవాలిఅనుకుంటే,ఈ మూవీని చూడండి.