HIT 3 OTT: న్యాచురల్ స్టార్ నాని వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి హిట్ 3 గతంలో వచ్చిన హిట్ ప్రాంచేజీలో ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. మే 1 న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. నాని తొలిసారి ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఓటీటీ డీటెయిల్స్..
గతంలో వచ్చిన సినిమాలు హిట్, హిట్ 2 మంచి విజయాన్ని అందుకున్నాయి. తొలి భాగంలో విశ్వక్సేన్, రెండో భాగంలో అడవి శేష్ లీడ్ రోల్స్ పోషించగా.. ఇప్పుడు మూడో పార్ట్ లో నాని వస్తున్నాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. తాజాగా ఓటీటీ హక్కుల వివరాల గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకుంది. ఆ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.54 కోట్లు పెట్టడం విశేషం. నాని కెరీర్లో ఓ సినిమా డిజిటల్ హక్కుల కోసం వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే. హిట్ ఫ్రాంఛైజీ సూపర్ హిట్ కావడం, అందులోనూ నాని నటిస్తుండటం తో ఈ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి. నాని వల్లే ఈ సినిమాకు భారీ ధర పలికినట్లు తెలుస్తుంది.
Also Read:
హిట్ ఫ్రాంఛైజీ..
హిట్ 3 లాంటి సినిమాలో నాని నటిస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడ్డాయి. చివరికి నెట్‌ఫ్లిక్స్ హక్కులను దక్కించుకుంది.. గతంలో వచ్చిన హిట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే హిట్ 2 మూవీ కూడా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న మాస్ యాక్షన్ మూవీలో నాని నటిస్తుండటం తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. హిట్ 3 కోసం రూ.64 కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. అయితే అందులో 90 శాతం కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే వచ్చేశాయి.. నాని సరసన శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఈ కేజీఎఫ్ ఫేమ్ తెలుగులోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. మాస్ యాక్షన్ కధతో రాబోతున్న ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.