BigTV English

Thriller Movie OTT : ఊరు మొత్తాన్ని భయంతో వణికిపోయేలా చేసిన అమ్మాయి.. అసలు ట్విస్ట్ అదే..

Thriller Movie OTT : ఊరు మొత్తాన్ని భయంతో వణికిపోయేలా చేసిన అమ్మాయి.. అసలు ట్విస్ట్ అదే..

Thriller Movie OTT : ఓటీటీలోకి వస్తున్న సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఒకవైపు థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయినా కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో వచ్చే కంటెంట్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. దాంతో ఇక్కడ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలకు డిమాండ్ మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. ఈ మధ్య ఈ రెండు ఇండస్ట్రీలో నుంచి వస్తున్న హారర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఓటీటీ సంస్థలు హారర్, థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తుంటారు. తాజాగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఓ హారర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మూవీ లవర్స్ కోసం ఆలస్యం లేకుండా సినిమా పేరు పూర్తి వివరాలను తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ హారర్ సినిమాలు తెలుగులో మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు. అటు ఓటీటీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఓ హారర్ మూవీ ప్రేక్షకులను భయపెడుతుంది. ఆ సినిమా పేరు యమ కాతగి.. ఇదొక తమిళ మూవీ. గత నెల 7న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఓ అమ్మాయి ఆత్మహత్య, అంత్యక్రియల కోసం కదలని ఆమె శవం ఓ ఊళ్లోవాళ్లకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందన్నది ఈ సినిమాలో చూపించారు. గతంలో పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఈ నెల 12 న ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఏప్రిల్ 14 నుంచి యమకాతగి మన ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇదే ఓటీటీలో శుక్రవారం నుంచి వెబ్ అనే మరో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నేడు అర్ధ రాత్రి ఓటీటీలోకి రాబోతుంది.


స్టోరీ విషయానికొస్తే.. 

తమిళనాడులోని తంజావూరు దగ్గర్లో ఉన్న ఓ ఊరిలో జరిగిన కథ ఆధారంగా రూపొందించారు. పెపిన్ జార్జ్ జయశీలన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో రూపా కొడువాయూర్, నరేంద్ర ప్రసత్ నటించారు.. స్థానిక ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే కాప్పు కాట్టుకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ఏర్పాట్లను ఆ ఊరి పెద్ద అయిన సెల్వరాజ్ పర్యవేక్షిస్తుంటాడు. అతని కూతురు లీలా చిన్నతనం నుంచీ ఆస్తమాతో బాధపడుతూ ఉంటుంది. అయితే తన కూతురుతో ఒక రోజు పెద్ద గొడవ జరుగుతుంది. అవమానం భరించలేక లీలా ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆమె అంత్యక్రియల కోసం ప్రయత్నించగా.. మంచంపై ఉంచి ఆమె శవాన్ని ఎవరూ కదపలేకపోతారు. అది చూసి ఊళ్లో వాళ్లు భయపడతారు.ఆమె ఎందుకు కదల్లేదు అనే విధంగా ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ.. కాస్త ఇంట్రెస్టింగ్ లైన్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. ఇక్కడ ఓటీటీలో అయిన ఆకట్టుకుంటుందేమో చూడాలి..

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×