E-Paper
Advertisement

Year Ender 2025 : మోస్ట్ అండర్రేటెడ్ మలయాళం మూవీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

Year Ender 2025 : మోస్ట్ అండర్రేటెడ్ మలయాళం మూవీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
Advertisement

Year Ender 2025 : మలయాళ సినిమా ఇండస్ట్రి 2025లో ‘లోకా’ లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ అందించింది. అయితే మరికొన్ని అద్భుతమైన సినిమాలు తక్కువ అంచనాలతో కనీసం రిలీజ్ అయ్యాయి అనే టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. మోహన్‌లాల్ ‘తుడరుం’ లాంటి సినిమాల సక్సెస్ తో ఆయా చిన్న సినిమాలు చిన్నబోయాయి. అర్జున్ అశోకన్ ‘తలవర’, అనస్వర రాజన్ ‘వ్యసనసమేతం బంధుమిత్రాధికల్’, అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ఫెమినిచి ఫాతిమా’ లాంటివి మంచి కథలు ఉన్నప్పటికీ థియేటర్స్‌లోనూ, అలాగే OTTలోనూ పెద్దగా గుర్తింపు పొందలేదు. ఈ ఫెస్టివల్ వీకెండ్‌లో చూడడానికి పర్ఫెక్ట్ అయిన అలాంటి టాప్ 6 అండర్‌రేటెడ్ మలయాళ జెమ్స్ ఇవిగో.

తలవర (Thalavara)

అర్జున్ అశోకన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జ్యోతిష్ అనే యువకుడు స్కిన్ డిసీజ్ వల్ల సొసైటీ నుంచి ఎదుర్కొనే సమస్యల చుట్టూ స్టోరీ సాగుతుంది. అతను ఆ అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్లే పోరాటం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అఖిల్ అనిల్‌ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్ అవ్వలేదు. Prime Videoలో ఈ మూవీని చూడొచ్చు.

నారాయణీంటే మూన్నాన్మక్కల్ (Narayaneente Moonnaanmakkal)

Advertisement

శరణ్ వేణుగోపాల్ డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ డ్రామాలో ముగ్గురు సోదరులు తమ తల్లి మరణశయ్య మీద ఉన్నప్పుడు ఇంటికి తిరిగి వస్తారు. దశాబ్దాల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ సంతోషకరమైన క్షణాలతో పాటు చేదు జ్ఞాపకాలను కూడా రేకెత్తిస్తుంది. జోజు జార్జ్, సురాజ్ వెంజారమూడు, అలెన్సియర్ లే లోపెజ్ ముగ్గురు సోదరులు గా నటించారు. థామస్ మాథ్యూ, గార్గి అనంతన్ యంగ్ కజిన్స్ గా కన్పిస్తారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.

వ్యసనసమేతం బంధుమిత్రాధికల్ (Vyasanasametham Bandhumithradhikal)

అంజలిగా అనస్వర రాజన్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ ఇది. ఆమె ఫియాన్సే ప్రతి విషయంపై కంట్రోల్ లో పెట్టడంతో ఇబ్బంది పడుతుంది. అమ్మమ్మ మరణం తర్వాత గొడవలు మొదలవుతాయి. నైబర్స్, లోకల్ లీడర్స్, దూరపు బంధువులు జోక్యం చేసుకుంటారు. డైరెక్టర్ ఎస్ విపిన్ ఈ సిచుయేషన్‌ను హ్యూమర్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో చక్కగా చిత్రీకరించారు. Manorama Maxలో దీన్ని చూడవచ్చు.

ఫెమినిచి ఫాతిమా (Feminichi Fathima)

Advertisement

ఈ సినిమాతో షమ్లా హమ్జా బెస్ట్ యాక్ట్రెస్ కేరళ స్టేట్ అవార్డ్ గెలుచుకుంది. అవార్డ్ బజ్ లేకపోతే ఈ సినిమాను దాదాపు ఎవరూ నోటీస్ చేసేవారు కాదు. ఫాతిమా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటుంది. కానీ ఆమె ఒక సింపుల్ మ్యాట్రెస్ అడిగితే ఎవరూ సపోర్ట్ చేయరు. ఈ సినిమా ఫెస్టివల్ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిందే. మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సంశయం (Samshayam)

వినయ్ ఫోర్ట్, షరఫుద్దీన్ లీడ్ రోల్స్ పోషించిన మూవీ ఇది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినా ఆడియెన్స్ పూర్తిగా వదిలేశారు ఈ మూవీని. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయినా తెలియలేదు. షరఫుద్దీన్ ఇతర సినిమాలు ‘ది పెట్ డిటెక్టివ్’, ‘పడకలం’ మిక్స్‌డ్ రివ్యూస్‌తో డీసెంట్ రన్ అయ్యాయి. ఈ మూవీని కూడా మనోరమా మ్యాక్స్ లో చూడవచ్చు.

ఇతిరి నేరం (Ithiri Neram)

ఇందులో రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్ లీడ్ పెయిర్ గా నటించారు. ఫార్మర్ లవర్స్ అనీష్ – అంజన 7 ఏళ్ల తర్వాత కలుస్తారు. ఒక ఈవెనింగ్ గడిపి పాత రొమాంటిక్ మెమరీస్ ను గుర్తు చేసుకుంటారు. ప్రశాంత్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ Sun NXT లోకి వస్తోంది.

Read Also :  హాలీవుడ్ నుంచి మరాఠీ వరకు… జియో హాట్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు, సిరీసులు

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×