BigTV English
Advertisement

OTT Movie : బాక్సింగ్ క్వీన్ అయ్యే ఫ్యాట్ లేడీ… ఓటీటీలో అదరగొడుతున్న చైనీస్ మూవీ

OTT Movie : బాక్సింగ్ క్వీన్ అయ్యే ఫ్యాట్ లేడీ… ఓటీటీలో అదరగొడుతున్న చైనీస్ మూవీ

OTT Movie : సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటాము. వీటిలో కొన్ని సినిమాలు చూస్తే ఉత్సాహంతో చప్పట్లు కూడా కొడతారు. అంతలా మనసుని హత్తుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో హీరోయిన్ ను చాలామంది మోసం చేస్తారు. పైగా ఆమె చాలా లావుగా కూడా ఉంటుంది. చివరికి సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంటుంది. ఆమె జీవితంలో నేర్చుకున్న పాఠాలను చూస్తే, చెప్పడానికి మాటలు కూడా చాలవు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫిక్స్ (Netflix) లో

ఈ చైనీస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘యోలో’ (YOLO). 2024 లో వచ్చిన ఈ చైనీస్ కామెడీ మూవీకి జియా లింగ్ దర్శకత్వం వహించారు. జియా, లీ జియాయిన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో హీరోయిన్ బాక్సింగ్ కోచ్ హావో కున్‌ను కలిసిన తర్వాత, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ తరువాత బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది. YOLO ప్రపంచవ్యాప్తంగా $484.5 మిలియన్లు వసూలు చేసింది. ఇది 2024లో అత్యధిక వసూళ్లు చేసిన చైనీస్ చిత్రంగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన తల్లి, అక్క తో కలిసి జీవిస్తూ ఉంటుంది. వీళ్లకు ఒక జనరల్ స్టోర్ ఉంటుంది. హీరోయిన్ ఎప్పుడూ చాలా బద్ధకంగా ఉంటుంది. ఆమె ఏ పని చేయకపోవడంతో చాలా లావుగా కూడా తయారైపోతుంది. ఈమె సిస్టర్ భర్తను వదిలి, తల్లి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం పెళ్లి సమయంలో చెప్పకపోవడంతో, ఆ విషయం తెలిసి భర్త వదిలేస్తాడు. చెల్లెల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది అక్క. పనిచేయడం చేతకాదని, తిండి దండగని తిట్టడంతో ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. వెళ్లేముందు తన పేరుతో ఉన్న ఒక అపార్ట్మెంట్ ని సిస్టర్ కి రాసిస్తుంది. ఎందుకంటే దాని గురించి ఆమె ఆశ పడుతూ ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక కాఫీ షాప్ లో పనిచేస్తుంది. ఈమెకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు వ్యక్తులు కూడా మోసం చేస్తారు. వాళ్లలో ఒకతన్నీ హీరోయిన్ ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను, హీరోయిన్ ఫ్రెండ్ నే ప్రేమిస్తాడు. ఇది తెలిసి మరింతగా బాధపడుతుంది హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ కి బాక్సింగ్ అకాడమీలో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు హీరోయిన్ పై ప్రేమ చూపిస్తున్నాడనుకొని, చాలా హ్యాపీగా ఉంటుంది. తనతో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అయితే అతడు డబ్బు కోసం బాక్సింగ్ ని వదులుకోవాలనుకుంటాడు. అలా చేయొద్దు అని హీరోయిన్ అతనికి చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి హీరోయిన్ ను బాగా తిడతాడు. నీలాంటి వాళ్లతో నేను రిలేషన్ పెట్టుకోనని వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత హీరోయిన్ పనిచేసే కాఫీ షాప్ ఓనర్, తనతో అసభ్యంగా మాట్లాడతాడు. అతనికి గట్టిగా ఒక పంచ్ ఇస్తుంది హీరోయిన్. పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ కజిన్ వచ్చి విడిపిస్తుంది. ఆమెను ఒక రియాలిటీ షో కి తీసుకువెళ్లి అవమానిస్తుంది. ఇక్కడ కూడా హీరోయిన్ మోసపోతుంది. చివరికి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. చిన్నపాటి దెబ్బలతో బయటపడుతుంది. ఆ తర్వాత బాక్సింగ్ నేర్చుకోవాలని అకాడమీకి వెళుతుంది. లావుగా ఉన్నావని ఎగతాళి చేసినా, ఆరు నెలల్లో తగ్గుతానని చెప్పి జాయిన్ అవుతుంది. అన్నట్టుగానే చాలా స్లిమ్ గా తయారవుతుంది. బాక్సింగ్ లో కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. చివరికి ఆమె ఇంటర్నేషనల్ పోటీకి వెళ్తుంది. ఈ పోటీలో హీరోయిన్ గెలిచిందా? తనని మోసం చేసిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పింది? తన జీవితాన్ని ఎలా దిద్దుకుంది? ఈ విషయాలను మూవీలో చూసి తెలుసుకోండి. ఇటువంటి సినిమాలు చూస్తే, ఏదైనా చేయగలమనే సంకల్పం పెరుగుతుంది.

Related News

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×