Suhaas : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబర్గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించాడు. అయితే ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ని అందుకోలేకపోయాయి. అంతకు ముందు ఏడాది వచ్చినా ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సినిమాలు విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రేమ కథతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహాస్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఆ పోస్ట్ లో ఏముందంటే.. తన చిన్న నాటి ఫ్రెండ్ మనోజ్ సూసైడ్ చేసుకున్నాడని రాశాడు. అతను చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు అందరితో కలిసిపోతాడు. ఏదైనా అనుకుంటే వెంటనే చేసే క్యాపాసిటీ తనకు ఉంది. అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేసాడో అర్థం కాలేదు. నాకు మాటలు రావడం లేదు. బాధగా ఉంది. నాకు ఈ విషయం గురించి చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు.. అసలు ఏమైంది.. ఎంత పని చేసావు రా నా కొడకా అంటూ హార్ట్ బ్రేక్ అయిన సింబల్ ను పెట్టి తన ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ను చూసిన ఆయన ఫ్యాన్స్ ఊరుకో అన్నా ఎప్పుడు ఎవరు పొతారో తెలియదు.. మనం అతిగా ప్రేమిస్తే ఇలానే బాధ పడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read :
ఏంటి విష్ణు.. ఇంక నువ్వు మారవా..?
ఇక సుహాస్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది జనక అయితే గనక అనే క్యాచి టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాంతో సినిమా రెండు రోజులకే వెనక్కి వెళ్ళిపోయింది. భారీ నష్టాలను మిగిల్చింది. ఇక తాజాగా ఓ ప్రేమ కథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. V ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ నల్ల ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ భామ అయ్యో రామ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. రీసెంట్ గానే సినిమాలో హరీష్ శంకర్ కి సంబంధించిన సీన్స్ షూట్ పూర్తి చేశారట. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయని టాక్.. సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ పై సుహాస్ ఆశలు పెట్టుకున్నాడు.. చూడాలి మరి ఎలాంటి హీట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో..