OTT Movie : ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ ల హవా నడుస్తోంది. వీటిని కొత్త తరహాలో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సీరీస్ సస్పెన్స్, డ్రామా, మరియు డార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఈ సిరీస్ తెలుగులో డబ్ చేయబడలేదు. కానీ తెలుగు సబ్‌టైటిల్స్‌తో దీనిని చూడవచ్చు. ఈ సీరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘యు’ (You). దీనిని కెరొలిన్ కెప్నెస్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ను గ్రెగ్ బెర్లాంటి, సెరా గాంబుల్ అభివృద్ధి చేశారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం ఐదు సీజన్లను కలిగి ఉంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు రిలీజ్ అయ్యాయి. చివరి సీజన్ (సీజన్ 5) ఏప్రిల్ 24, 2025న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది.
స్టోరీ లోకి వెళితే
ఈ సిరీస్ జో గోల్డ్‌బర్గ్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. జో ఒక బుక్‌స్టోర్ మేనేజర్‌గా పనిచేసే సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి అతను ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్. అతని జీవితం ప్రేమ, అబ్సెషన్, హింసతో నిండి ఉంటుంది. ప్రతి సీజన్‌లో, జో ఒక కొత్త మహిళపై మోజు పెంచుకుంటాడు. ఆమెను ప్రేమించడం కోసం చాలా పాట్లు పడతాడు. కానీ అతని వక్ర మనస్తత్వం వల్ల విషాదకరమైన పరిణామాలు సంభవిస్తాయి.
సీజన్ 1: జో న్యూయార్క్‌లో గ్వెనెవీర్ బెక్ అనే రచయిత్రిని కలుస్తాడు. ఆమె పట్ల అతనికి అబ్సెషన్ పెరుగుతుంది. ఆమె జీవితంలోకి వెళ్ళడానికి, అతను సోషల్ మీడియా ఇతర మార్గాలను ఉపయోగిస్తాడు. జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి అతను హత్యలు చేస్తాడు, చివరికి బెక్‌ను కూడా చంపేస్తాడు.
సీజన్ 2: జో లాస్ ఏంజిల్స్‌కు తప్పించుకుని వెళ్తాడు, అక్కడ అతను లవ్ క్విన్ అనే మహిళతో ప్రేమలో పడతాడు. కానీ ప్రేమించిన అమ్మాయి గతం, చీకటి స్వభావం కలిగిన వ్యక్తిగా జో తెలుసుకుంటాడు. ఈ సీజన్‌లో జో గతం అతన్ని వెంటాడుతుంది. లవ్ క్విన్ తో అతని సంబంధం ఊహించని మలుపులు తిరుగుతుంది.
సీజన్ 3:జో, లవ్ ఇప్పుడు వివాహం చేసుకుని, ఒక బిడ్డతో కలిసి సబర్బన్ పట్టణంలో జీవిస్తారు. వారి వివాహం హత్యలు, అసూయ, రహస్యాలతో నిండి ఉంటుంది. చివరికి లవ్ క్విన్ కూడా జోను చంపడానికి ప్రయత్నిస్తుంది, కానీ జో ఆమెను చంపి మళ్లీ తప్పించుకుంటాడు.
సీజన్ 4: జో లండన్‌లో కొత్త గుర్తింపుతో జీవితాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ అతను ఒక సంపన్న సామాజిక వర్గంలో చేరతాడు. ఈ సీజన్‌లో అతను ఒక కిల్లర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరికి అతనే ఆ హత్యలకు కారణమని తెలుస్తుంది. అతని గతం, వర్తమానం మధ్య సంఘర్షణగా ఈ సీజన్‌ను నిలుస్తుంది.
సీజన్ 5 (చివరి సీజన్):ఈ సీజన్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇది జో కథను ముగించే సీజన్‌గా ఉంటుందని తెలుస్తోంది. అతని గతం నుండి కొందరు తిరిగి వచ్చి, అతని చీకటి ప్రయాణానికి, ఒక అంతం పలుకుతాయని అభిమానులు ఊహిస్తున్నారు.