OTT Movie : ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే అభిమానులకోసమే. ఈ సినిమా నాలుగు ఋతువులలో (వసంతం, వేసవి, శరదృతువు, శీతాకాలం) ఇసాబెల్ అనే అమ్మాయి జీవిత కథను చూపిస్తుంది. ఆమె టీనేజ్ లో అడుగుపెట్టగానే కోరికలను తీర్చుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తుంది. ఆన్‌లైన్ ఎస్కార్ట్‌గా మారి ఎవడితో పడితే వాడితో అలాంటి పనులు చేస్తుంది. చివరికి ఆమె జీవితం ఎలాంటి టర్న్ తీసుకుందనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలలోకి వెళ్తే …
ఇసాబెల్ అనే 17 ఏళ్ల ఫ్రెంచ్ యువతి, తన తల్లి సిల్వీ, సవతి తండ్రి, సోదరుడు విక్టర్‌తో పారిస్‌లో నివసిస్తుంటుంది. స్ప్రింగ్ సీజన్ లో ఫ్యామిలితో ఒక విహారయాత్రకి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక జర్మన్ యువకుడితో తన మొదటి అనుభవం పొందుతుంది. కానీ అది ఆమెకు అంతగా సంతృప్తి ఇవ్వదు. ఈ అనుభవం తర్వాత, ఇసాబెల్ తనలోని కోరికల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటుంది. ఇక సమ్మర్ లో “లీ” అనే మారుపేరుతో ఒక ఆన్‌లైన్ ఎస్కార్ట్‌గా పని మొదలుపెడుతుంది. ఆమె చాలా మందితో ఆ అనుభవం పొందుతుంది. వారిలో ఒక వృద్ధుడైన పాట్రిక్, ఆమెతో ఒక ఎమోషనల్ కనెక్షన్‌ను ఏర్పరచుకుంటాడు. ఇసాబెల్ ఈ జీవితాన్ని రహస్యంగా గడుపుతుంటుంది.
Autumn సీజన్ (శరదృతువు)లో, పాట్రిక్‌తో అలాంటి పనిలో ఉన్నప్పుడు అతను గుండెపోటుతో మరణిస్తాడు. ఇది ఇసాబెల్ జీవితంలో ఒక విషాద టర్నింగ్ పాయింట్‌గా మారుతుంది. పోలీసులు ఆమె ఎలాంటి జీవితం గడుపుతుందో తెలుసుకుంటారు. ఆమె తల్లి సిల్వీకి తెలియజేస్తారు. దీనితో సిల్వీ షాక్ అవుతుంది. కోపంతో తనని తిడుతుంది. ఇసాబెల్ ను ఇలాంటి పనులను ఆపమని ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె వీటిని మనుకోవడానికి ఒక సైకాలజిస్ట్ ని కలవాలనుకుంటుంది. ఇక శీతాకాలంలో ఇసాబెల్ పాట్రిక్ భార్య అలిస్ ని కలుసుకుంటుంది. ఇక్కడ టాపిక్ ఎమోషనల్ గా మారుతుంది. చివరికి ఇసాబెల్ ఇలాంటి పనులు మానుతుందా ? అలాగే కంటిన్యూ అవుతుందా ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
‘Young and Beautiful’ 2013లో విడుదలైన ఫ్రెంచ్ డ్రామా చిత్రం. ఫ్రాంసోవా ఒజోన్ దర్శకత్వంలో, మెరీన్ వాక్ట్ (ఇసాబెల్), జెరాల్డిన్ పైలాస్ (సిల్వీ), ఫ్రెడెరిక్ పియరోట్ (పాట్రిక్), షార్లోట్ రాంప్లింగ్ (అలిస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా
2013 మే 16న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2013 ఆగస్టు 21న ఫ్రాన్స్‌లో విడుదలైంది. 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్ అవుతోంది.