E-Paper
Advertisement

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్
Advertisement

Action Thriller on OTT : ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టడం ఒక శాస్త్రవేత్త జీవితంలోనే అతిపెద్ద విజయంగా నిలవాలి. కానీ అదే ఆవిష్కరణ కోసం కొందరు ఆమెను వెంటాడితే… ఎన్నో ఏళ్ల కష్టంతో సాధించిన పరిశోధనను దొంగిలించి, తన ప్రాణాలకే ముప్పు తెస్తే… పైగా ఎత్తులంటేనే భయపడే వ్యక్తి వందల అడుగుల ఎత్తులో ప్రమాదకరమైన మార్గాన్ని దాటాల్సి వస్తే? శాస్త్రీయ ఆవిష్కరణ, కుట్ర, ప్రాణాల కోసం పోరాటం కలగలిసిన బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘జిప్ వైర్’ (Zip Wire). మరి ఈ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

అమీ వాట్సన్ ఓ టాలెంటెడ్ ఔషధ పరిశోధకురాలు. ఆమెకు పదమూడేళ్ల వయసున్నప్పుడు నయం చేయలేని వ్యాధితో తల్లి మరణిస్తుంది. ఆ విషాదం అమీని కుంగదీస్తుంది. తన తల్లిలా మరెవరూ బాధ పడకూడదనే సంకల్పంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, చివరకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కు చికిత్సను కనుగొనే దిశగా కీలకమైన ఆవిష్కరణ చేస్తుంది. అయితే ఆ విజయం ఆమె జీవితంలో కొత్త సమస్యలకు దారితీస్తుంది. అమీ పరిశోధనను ఎవరో దొంగిలిస్తారు. అదే సమయంలో ఆమెకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి హత్యకు గురవుతాడు.

Advertisement

తన ఆవిష్కరణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆమెకు అర్థమవుతుంది. పరిశోధనను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకునే వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకుంటారు. తన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు, ఎన్నో ప్రాణాలను రక్షించగల ఆవిష్కరణను కూడా కాపాడాల్సిన పరిస్థితి అమీకి ఎదురవుతుంది. ఈ కుట్రలో ఔషధ పరిశ్రమకు చెందిన శక్తిమంతమైన వ్యక్తుల పాత్రపై అనుమానాలు పెరుగుతాయి. పరిశోధనను ప్రపంచానికి అందించడం కంటే దానిపై నియంత్రణ సాధించడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుంది.

అమీ ఎవరిని నమ్మాలి ? తనను వెంటాడుతున్నవారు ఎవరు ? పరిశోధనకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎలా కాపాడాలి ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఆమె ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. అమీకి ఉన్న మరో పెద్ద సమస్య ఎత్తులంటే భయం. అంతేకాదు, ఆమెకు కొన్ని విషయాలపై తీవ్రమైన ఆందోళన, పదేపదే తనిఖీ చేయాలనే అలవాట్లు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఆమెకు మిగిలే మార్గం ఓ ప్రమాదకరమైన వైర్‌ మార్గం. కింద లోతైన లోయ, చుట్టూ ప్రమాదం… ఆ మార్గాన్ని దాటకపోతే ప్రాణాలు దక్కని పరిస్థితి. తనలోని భయాన్ని అధిగమించడంతో పాటు, తనను వెంబడిస్తున్నవారి కుట్రను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి అమీ ఎలా బయటపడుతుంది ? తన పరిశోధనను తిరిగి సాధించగలదా ? తనను వెంటాడుతున్న కుట్ర నుంచి అమీ తప్పించుకోగలదా? ఎత్తుల భయాన్ని అధిగమించి పరిశోధనను కాపాడగలదా? అన్నదే కథలోని ప్రధాన ఉత్కంఠ.

Advertisement

Also Read : ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

ఏ ఓటీటీలో ఉంది ?

‘జిప్ వైర్’ 2026లో విడుదలైన ఇంగ్షీషు యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం కొన్ని ప్రాంతాల్లో డిజిటల్‌ గా Amazon Prime Video, Apple TVలలో అద్దె లేదా కొనుగోలు రూపంలో అందుబాటులోకి వచ్చింది. మయానా బూరింగ్‌ (MyAnna Buring) అమీ పాత్రలో నటించగా, సాఫ్రన్‌ బరోస్‌ (Saffron Burrows), జోసెఫ్‌ మిల్సన్‌ (Joseph Millson) కీలక పాత్రల్లో కనిపిస్తారు. హోవర్డ్‌ జె. ఫోర్డ్‌ (Howard J. Ford) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టామ్‌ బాయిల్‌ (Tom Boyle) కథ అందించారు.

Related News

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

Big Stories

Advertisement
×