E-Paper
Advertisement

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!
Advertisement

Haindava Teaser: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత ఏడాది కిష్కింధపురి, భైరవం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే హైందవ సినిమా(Haindava Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్ర బృందం టీజర్ వీడియో విడుదల. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విష్ణుమూర్తి అవతారాలు..

ఈ టీజర్ వీడియోలో భాగంగా.. ఒక పల్లెటూరిలో పురాతన ఆలయంలో ఉన్న విగ్రహాల చోరీ నేపథ్యంలో కొనసాగుతోంది. ఈ గ్రామంలో ఒక పెను విపత్తును నివారించడానికి విష్ణుమూర్తి అవతారాలు ఆలయం నుంచి ఉద్భవించి తిరిగి వెళ్తాయని ఒక నమ్మకం. అయితే ఆలయంలో విగ్రహాలు చోరీ కావడంతో ఈ చోరీ వెనుక ఉన్న కారణం ఏంటి? అనే నేపథ్యంలో ఈ టీజర్ వీడియో కొనసాగుతుంది ఇక ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(బెల్లంకొండ Sai Srinivas) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి ఈ టీజర్ వీడియో మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తోంది. మరి నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది.

పురాతన దశావతార ఆలయం నేపథ్యంలో..

Advertisement

ఈ సినిమాకు లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోడిగా సంయుక్త మీనన్(Samyuktha memon) ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జెడి చక్రవర్తి, మహేష్ మంజ్రేకర్ వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైథాలజికల్ మిస్టరీ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా సినిమాను మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. 400 ఏళ్ల నాటి ఒక పురాతన దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఆధ్యాత్మికత, రహస్యం, సాహసాల సమ్మేళనంగా ఈ సినిమా రాబోతోంది.

Advertisement

ఇక దేవులపై నమ్మకం లేనటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఒకానొక సమయంలో యాక్షన్ లవ్ రొమాంటిక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల కాలంలో పూర్తిగా తన జోనర్ మారుస్తూ ఇలాంటి మైథాలజికల్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి హైందవ సినిమా బెల్లంకొండ హీరోకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో విడుదల కూడా ఆలస్యం అవుతూ వస్తుంది.

Also Read: కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

Related News

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

Big Stories

Advertisement
×