E-Paper
Advertisement

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?
Advertisement

Visakhapatnam Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిపై కూటమిలోని మూడు పార్టీల నేతలూ ముచ్చట పడుతున్నారు. అతి పెద్ద కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత జరుగుతోన్న మొదటి ఎన్నికలు కాబట్టి టిడిపి జెండానే ఎగరాలని ఆ పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఏపీకి అన్ని విధాల సహకరిస్తోన్న బిజెపికి మేయర్ పదవిని అప్పగిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కమలనాథులు కోరుతున్నట్లు సమాచారం. ఇక పవన్ కల్యాణ్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న విశాఖలో మేయర్ పదవి జనసేనకు ఇవ్వడమే న్యాయమని సైనికులు లాజిక్ లాగుతున్నట్లు సమాచారం. ఇక వైసీపీ కూడా విశాఖ మేయర్ పదవిపై పెద్ద ఆశలే పెట్టుకుంది. తమ హయాంలో విశాఖలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. అయితే గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు కంపెనీలను విశాఖకు తెచ్చిన ఘనత టిడిపిదే కాబట్టి విశాఖ ఓటర్లు కూటమి వైపే ఉంటారని టిడిపి ధీమాగా ఉంది.

గంటా శ్రీనివాసరావు..

జివిఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో కీలక నేతలంతా ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య పేరు గట్టిగానే వినిపిస్తోంది. విశాఖ ఎంపీ భరత్ భార్య.. నందమూరి బాలయ్య కూతురు నందమూరి తేజస్విని పేరుకూడా ప్రచారంలో ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన పొంగూరు శరణి, పెందుర్తి టిడిపి నేత గండి బాబ్జీ భార్య జాగృతి పేర్లతో పాటు విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడు పట్టాభి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయంటున్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భార్య పేరుతో పాటు విశాఖ ఉత్తర నియోజక వర్గ జనసేన ఇన్ ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీలు మేయర్ పదవి పోటీకి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

Also read: భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ఇక వైసీపీ తరపున..

కూటమి తరపున బిజెపి కూడా మేయర్ పదవి రేసులో ఉంది.అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ భార్య శ్రీదేవి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూతురు శ్యామలా దీపిక తోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కుటుంబం నుంచి ఒకరు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ తరపున ఎమ్మెల్సే వరుదు కల్యాణి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూతురు అనూష, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ భార్య హిమ గౌరి పేర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కోడలు పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే కూటమి అభ్యర్ధిని బట్టి బలమైన అభ్యర్ధిని బరిలో దించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

అభ్యర్ధుల ఎంపిక..

Advertisement

మొదటి సారి మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుండడం విశేషం. దీంతో అభ్యర్ధుల ఎంపిక చాలా కీలకం కానుంది.కేవలం రాజకీయ నేపథ్యమే కాకుండా విశాఖ నగర సమస్యలపై అవగాహన ఉన్నవారినే బరిలో దించాలని పార్టీలు భావిస్తున్నాయి.

Also ead: కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

Tags

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

Big Stories

Advertisement
×