Osaka Expo: తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచానికి చాటి చెప్పారు. జపాన్ వేదికగా ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ బృందం హాజరైంది.
వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపారమైన అవకాశాలను వారితో చర్చించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం, దేశంలో మొదటి తెలంగాణ ఇందులో పాలు పంచుకోవటం చాలా గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ-జపాన్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని భాగస్వామ్యంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూప కల్పనకు కలిసి పని చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో కొదవ లేదన్నారు.
హైదరాబాద్‌కు పారిశ్రామిక వేత్తలు వచ్చి మీ ఉత్పత్తులు తయారు చేయాలన్నారు.
భారత మార్కెట్‌తోపాటు ప్రపంచంలో వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని సూచన చేశారు.
ఈ సందర్భంగా జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఏర్పాటు చేస్తున్న కొత్త నగరం ఆధారపడి ఉందన్నారు.
జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు.